దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దిగ్గజాలకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు. సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 76 పరుగులు చేసి టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7వ సారి 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు విరాట్. ఇప్పటివరకు 6 సార్లు ఈ ఫీట్ సాధించి.. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరతో సమంగా ఉన్నాడు కోహ్లీ. అయితే తాజా ఇన్నింగ్స్‌తో అగ్రస్థానానికి చేరుకున్నాడు టీమిండియా రన్ మెషిన్.
శ్రీలంక కుమార సంగక్కర ఒక క్యాలెండర్ సంవత్సరంలో 6 సార్లు 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 5 సార్లు ఈఘనత సాధించగా, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే కూడా 5 సార్లు చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కల్లిస్, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్ తలా 4 సార్లు ఈ ఫీట్ సాధించారు. కాగా దక్షిణాఫ్రికాతో రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. 82 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీ పదో వికెట్‌గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. డీన్ ఎల్గర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
CLASSIC VIRAT!@imVkohli brings up his 30th Test half-century in 61 balls. He has hit 8 delightful boundaries and a power-packed six!
Live – https://t.co/032B8Fmvt4 #SAvIND pic.twitter.com/fZpkgswXAD
— BCCI (@BCCI) December 28, 2023
Virat Kohli in test vs SA in SA
119, 96, 46, 11, 5, 28, 153, 5, 54, 41, 35, 18, 79, 29, 38, 76
Innings – 16
Runs – 833
Avg – 52.06
100s – 2
50s – 4 pic.twitter.com/Ac8IhEK4gA— Pallavi (@Pallavi_paul21) December 28, 2023
Virat Kohli in test vs SA in SA
119, 96, 46, 11, 5, 28, 153, 5, 54, 41, 35, 18, 79, 29, 38, 76
Innings – 16
Runs – 833
Avg – 52.06
100s – 2
50s – 4 pic.twitter.com/Ac8IhEK4gA— Pallavi (@Pallavi_paul21) December 28, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..