Virat Kohli: పెర్త్‌లో భారీ రికార్డు సృష్టించిన టీమిండియా రన్ మెషీన్.. తొలి భారత ప్లేయర్‌గా..

|

Oct 30, 2022 | 7:13 PM

విరాట్ కోహ్లీ 2022 టీ20 ప్రపంచ కప్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లను గెలవడంలో భారత్‌కు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Virat Kohli: పెర్త్‌లో భారీ రికార్డు సృష్టించిన టీమిండియా రన్ మెషీన్.. తొలి భారత ప్లేయర్‌గా..
Virat Kohli
Follow us on

దాదాపు రెండున్నరేళ్ల పాటు పరుగుల కోసం ఇబ్బంది పడిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అతను ఫామ్‌కి తిరిగి రావడంతో, కోహ్లీ తన ఖాతాలో రికార్డులను జోడించుకుంటూ ముందుకుసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ తాజాగా సౌతాఫ్రికా మ్యాచ్‌లో మరో భారీ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి దక్షిణాఫ్రికాపై కూడా భారీ ఇన్నింగ్స్ చేస్తాడని భావించారు. కానీ, అది జరగలేదు. కేవలం 12 పరుగులు చేసిన వెంటనే కోహ్లి పెవిలియన్ చేరాడు.

అక్టోబర్ 30 ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లి 11 పరుగులు పూర్తి చేసిన వెంటనే, అతను టీ20 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం 1001 పరుగులతో నిలిచాడు.

విరాట్ కోహ్లితో పాటు భారత్ నుంచి 1000 పరుగులకు చేరువైన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మనే కావడం గమనార్హం. రోహిత్ 33 ఇన్నింగ్స్‌ల్లో 919 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో కోహ్లీకి మంచి ఫలితాలు వచ్చాయి. పాక్, నెదర్లాండ్స్‌పై కోహ్లీ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, దక్షిణాఫ్రికాపై అతను ఎక్కువసేపు నిలవలేదు. కేవలం 12 పరుగులు చేసి ఔటయ్యాడు.