IND vs SA U-19 World Cup: సౌతాఫ్రికాపై భారత్‌ సూపర్ విక్టరీ.. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధూల్‌..

|

Jan 16, 2022 | 7:26 AM

IND vs SA U-19 World Cup: అండర్ -19 ప్రపంచకప్‌లో భారత్ విజయంతో ప్రారంభించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన టోర్నీలో

IND vs SA U-19  World Cup: సౌతాఫ్రికాపై భారత్‌ సూపర్ విక్టరీ.. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధూల్‌..
Ind Vs Sa U 19 World Cup 2022
Follow us on

IND vs SA U-19 World Cup: అండర్ -19 ప్రపంచకప్‌లో భారత్ విజయంతో ప్రారంభించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ యశ్ ధుల్, స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్‌లు టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ యశ్ ధులే 82 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడాడు. విక్కీ సూపర్‌గా బౌలింగ్ చేయడం ద్వారా వేగంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మొదటగా బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌కి ఆరంభంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 11 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం షేక్‌ రషీద్‌, కెప్టెన్‌ యశ్‌ ధులేలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రషీద్ 54 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ నుంచి యష్, నిశాంత్ సింధు, రాజ్ బావా, కౌశల్ తాంబేలతో ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పి జట్టు స్కోరుని 200 దాటించాడు. అయితే కెప్టెన్ యష్ రనౌట్ కావడంతో జట్టు మొత్తం 46.5 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది.

యశ్ ధూల్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వీరితో పాటు నిశాంత్ సింధు 27 పరుగులు, రాజ్ బావా 13 పరుగులు, కౌశల్ తాంబే 35 పరుగులు చేశారు. టీమిండియా ఆరుగురు బ్యాట్స్‌మెన్లు కేవలం రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. వారిలో అంగక్రిష్ రఘువంశీ (5), హర్నూర్ సింగ్ (1), దినేష్ బానా (7), విక్కీ ఓస్త్వాల్ (9), రాజవర్ధన్ హంగర్గేకర్ (0), రవి కుమార్ (0) ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మాథ్యూ బోస్ట్ వేగంగా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు అఫీవ్ నియాండా, డేవిడ్ బ్రవీస్ చెరో రెండు వికెట్లు తీశారు. లియామ్ ఎల్డర్, మిక్కీ కోప్‌లాండ్ చెరో వికెట్ సాధించారు.

233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ తరఫున రాజ్‌వర్ధన్ హంగర్‌గెకర్ మెయిడిన్ ఓవర్‌లో జాన్ కన్నింగ్‌హమ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత వాలెంటిన్ కైటీమ్, డేవిడ్ బ్రావిస్ రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

China: చైనా నుంచి కొత్త ‘విపత్తు’..! ఇప్పటికే ఇద్దరు మరణం.. WHO హెచ్చరికలు..

ప్రతి నొప్పికి ఔషధం మీ వంటగదిలోనే ఉంది..! కరోనా సమయంలో వాటిని గుర్తించడం అత్యవసరం..

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లతో రోగనిరోధక శక్తి పెంచుకోండి.. ఒమిక్రాన్‌ని అంతం చేయండి..