IND vs SA Test History: భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్ చరిత్రలో రన్ రేట్‌ను తగ్గించడంలో తోపు బౌలర్లు వీళ్లే
టెస్ట్ క్రికెట్‌లో వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడం కూడా అంతే ముఖ్యం. త్వరలో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల టెస్ట్ చరిత్రలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్ల గురించి తెలుసుకుందాం.

IND vs SA Test History: టెస్ట్ క్రికెట్‌లో వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడం కూడా అంతే ముఖ్యం. త్వరలో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల టెస్ట్ చరిత్రలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్ల గురించి తెలుసుకుందాం. తమ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, బెస్ట్ ఎకానమీ రేట్‌ను నమోదు చేసిన టాప్-5 బౌలర్లు వీరే.
1. హన్సీ క్రోన్యే – సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోన్యే ఒక అద్భుతమైన ఆల్‌రౌండర్ మాత్రమే కాదు, చాలా పొదుపైన బౌలర్ కూడా. భారత్‌పై ఆడిన 11 టెస్ట్ మ్యాచ్‌లలో అతను 174 ఓవర్లలో కేవలం 316 పరుగులు ఇచ్చి 14 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేట్ ప్రతి ఓవర్‌కు కేవలం 1.81 పరుగులు. ఇది ఇప్పటికీ భారత్-సౌతాఫ్రికా టెస్ట్ చరిత్రలో బెస్ట్
2. బ్రయాన్ మెక్‌మిలన్ – సౌతాఫ్రికా
90వ దశకంలో సౌతాఫ్రికాకు నమ్మకమైన ఆల్‌రౌండర్ బ్రయాన్ మెక్‌మిలన్ కూడా భారత్‌ను అద్భుతంగా కంట్రోల్ చేశాడు. అతను 10 మ్యాచ్‌లలో 303 ఓవర్లు బౌలింగ్ చేసి 678 పరుగులు ఇచ్చి 23 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేట్ 2.23. అతను తన షార్ప్ లైన్, బౌన్స్ చేయగల సామర్థ్యం గల బౌలర్.
3. షాన్ పొలాక్ – సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా గొప్ప ఫాస్ట్ బౌలర్ షాన్ పొలాక్ భారత్‌పై అనేక చిరస్మరణీయ స్పెల్‌లు వేశాడు. 12 మ్యాచ్‌లలో అతను 52 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేట్ 2.26 పరుగులు ప్రతి ఓవర్‌కు. పొలాక్ ప్రత్యేకత ఏమిటంటే, అతను కొత్త బంతి, పాత బంతి రెండింటితోనూ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టేవాడు.
4. రవీంద్ర జడేజా – భారత్
భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా గత కొన్ని సంవత్సరాలుగా సౌతాఫ్రికాపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతను 9 మ్యాచ్‌లలో 42 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేట్ 2.27 పరుగులు ప్రతి ఓవర్‌కు. జడేజా బౌలింగ్ ఖచ్చితత్వం, నిరంతరం ఒకే లైన్‌పై బంతిని వేయగల సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది.
5. అనిల్ కుంబ్లే – భారత్
భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరు కూడా ఈ జాబితాలో ఉంది. అతను 21 మ్యాచ్‌లలో 84 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేట్ 2.34 పరుగులు ప్రతి ఓవర్‌కు. కుంబ్లే బౌలింగ్‌లో నియంత్రణ, స్థిరత్వం భారత జట్టు అతిపెద్ద బలం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




