IND vs SA : టీమిండియాకు బ్రేక్ అనేదే లేదు..టెస్ట్ సిరీస్ కోసం ముందుగానే కోల్‌కతాకు చేరుకోనున్న నలుగురు స్టార్ ప్లేయర్లు
ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకున్న టీమిండియా ప్రస్తుతం తమ తదుపరి సవాలుకు రెడీ అవుతుంది. నవంబర్ 14 నుంచి సొంతగడ్డ మీద సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న కోల్‌కతాకు ఆటగాళ్లు చేరుకుంటున్నారు.

IND vs SA : ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకున్న టీమిండియా ప్రస్తుతం తమ తదుపరి సవాలుకు రెడీ అవుతుంది. నవంబర్ 14 నుంచి సొంతగడ్డ మీద సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న కోల్‌కతాకు ఆటగాళ్లు చేరుకుంటున్నారు. టీ20 సిరీస్‌లో ఆడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా నలుగురు స్టార్ ఆటగాళ్లు అందరికంటే ముందుగా బ్రేక్ తీసుకోకుండా నేరుగా బ్రిస్బేన్ నుంచి కోల్‌కతా చేరుకోనున్నారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్ శనివారం చివరి మ్యాచ్ రద్దు కావడంతో ముగిసింది. భారత్ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా దృష్టి సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌పై పడింది. భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లు ఇప్పటివరకు వివిధ సిరీస్‌లలో బిజీగా ఉన్నారు. టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో ఆడగా, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ ఏ సిరీస్ ఆడారు.
ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగిసిన వెంటనే, కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి లభించినప్పటికీ, టెస్ట్ జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లకు మాత్రం బ్రేక్ లేకుండా నేరుగా కోల్‌కతా చేరుకుంటున్నారు. టీ20 సిరీస్ ఆడిన శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బ్రిస్బేన్ నుంచి నేరుగా కోల్‌కతాకు బయలుదేరారు. వారు శనివారం సాయంత్రం నాటికి హోటల్‌కు చేరుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి టీ20 ఆటగాళ్లు మాత్రం తమ ఇళ్లకు వెళ్తారు. మిగిలిన కీలక ఆటగాళ్లు కూడా త్వరలోనే కోల్‌కతాకు చేరుకోనున్నారు.
ఇండియా ఏ ఆటగాళ్లు: రిషబ్ పంత్ (వైస్-కెప్టెన్), మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఆదివారం (నవంబర్ 9) నాడు ఏ సిరీస్ ముగియగానే, నవంబర్ 10 (సోమవారం) నాటికి కోల్‌కతాకు చేరుకుని జట్టుతో కలుస్తారు. ఈ సిరీస్‌కు ముందు జట్టుకు ఎక్కువ విరామం లేనందున, టీమిండియా మొదటి ట్రైనింగ్ సెషన్ నవంబర్ 11 (మంగళవారం) నాడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సౌతాఫ్రికా జట్టు కూడా ఆదివారం నాడే కోల్‌కతాకు చేరుకుని హోటల్‌కు వెళ్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




