IND vs SA T20 Series: రాహుల్ vs రబాడ నుంచి పంత్ vs షమ్సీ వరకు.. పైచేయి ఎవరిదో?

|

Jun 06, 2022 | 9:57 AM

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో బంతికి, బ్యాట్‌కు మధ్య విపరీతమైన పోటీ నెలకొంటుందని భావిస్తున్నారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జూన్‌ 9న ఢిల్లీలో జరగనుంది.

IND vs SA T20 Series: రాహుల్ vs రబాడ నుంచి పంత్ vs షమ్సీ వరకు.. పైచేయి ఎవరిదో?
Ind Vs Sa T20 Series
Follow us on

జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా(IND vs SA) మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత జట్టు ఈ సిరీస్‌లోకి ప్రవేశిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ టీమిండియాకు నాయకత్వం వహించబోతున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తున్నందున భారత్‌కు ఈ సిరీస్ అంత సులభం కాదు. రెండు జట్లలోనూ కొంతమంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వారు ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేయగలరు. ఇటువంటి పరిస్థితిలో, బంతితోపాటు బ్యాట్ మధ్య ఉత్కంఠభరితమైన పోరాటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ T20 సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆటగాళ్ల గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం.

1. కేఎల్ రాహుల్ vs కగిసో రబడా: IPL 2022లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ 600 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మరోవైపు కగిసో రబడా 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. రాబోయే సిరీస్‌లో రబడా, కెప్టెన్ కేఎల్ రాహుల్‌ల పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు మంచి స్కోర్ చేయడంలో సహాయం చేయాలనుకుంటున్నాడు. మరోవైపు రాహుల్‌ను తొందరగా ఔట్ చేసేందుకు రబడా ప్రయత్నిస్తున్నాడు.

2. ఇషాన్ కిషన్ vs ఎన్రిక్ నార్కియా: IPL 2022లో ఓపెనర్ ఇషాన్ కిషన్ ప్రదర్శన అంత బాగా లేదు. అతను 418 పరుగులతో సీజన్‌ను ముగించాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఇషాన్ బాగా రాణించాలనుకుంటున్నాడు. అయితే దీని కోసం అతను ఎన్రిక్ నార్సియా వంటి బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2022లో ఫాస్ట్ బౌలర్ నార్కియా ఆరు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

ఇవి కూడా చదవండి

3. రిషబ్ పంత్ vs తబ్రేజ్ షమ్సీ: IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ పంత్ మొత్తం 340 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో పంత్ తన వికెట్‌ను సమర్పించుకూంటూ తర్వగా పెవిలియన్‌కు చేరడం కనిపించింది. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో పంత్ తన అలవాటును మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు. దీని కోసం, పంత్ స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాడు. అయితే, చైనామాన్ బౌలర్ తబ్రేజ్ షమ్సీ బౌలింగ్‌లో సత్తా చాటాల్సి ఉంటుంది.

4. డేవిడ్ మిల్లర్ vs హర్షల్ పటేల్: గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని ఛాంపియన్‌గా మార్చడంలో డేవిడ్ మిల్లర్ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ 2022లో మొత్తం 481 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ భారత్‌పై విధ్వంసం సృష్టించగలడు. హర్షల్ పటేల్ మిల్లర్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా నిరూపించుకోగలడు. ఇద్దరి మధ్య చాలా ఆసక్తికరమైన యుద్ధం ఉంటుంది. హర్షల్ పటేల్ స్లో, యార్కర్ బంతులతో ‘కిల్లర్ మిల్లర్’ పరీక్షను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాడు.

5. ఐడెన్ మార్క్రామ్ vs యుజ్వేంద్ర చాహల్: ఐపీఎల్ 15వ సీజన్‌లో, ఐడెన్ మార్క్రామ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున 47.63 సగటుతో 381 పరుగులు చేసి అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. మార్క్రామ్ భారతదేశానికి పెద్ద ముప్పుగా మారవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, యుజ్వేంద్ర చాహల్ వంటి స్పిన్నర్లు ఈ బ్యాట్స్‌మన్‌పై సమర్థవంతంగా రాణిస్తారు. ఐపీఎల్ 2022లో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్న చాహల్, బ్యాట్స్‌మెన్‌లను ట్రాప్ చేయడానికి తన స్పిన్ ట్రాప్‌లలో ప్రావీణ్యం సంపాదించాడు.