IND Vs SA Highlights: భారత్ 50 ఓవర్లలో 265/8.. 31 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం

| Edited By: Venkata Chari

Jan 19, 2022 | 10:30 PM

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. తాజాగా వన్డే సిరీస్ ప్రారంభమైంది. బొలాండ్ పార్క్ వేదికగా ఈ రెండు జట్లు తొలి వన్డేలో...

IND Vs SA Highlights: భారత్ 50 ఓవర్లలో 265/8.. 31 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
India Vs Sa

భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా బొలాండ్‌ పార్క్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘోర ఓటమిని చవిచూసింది. సఫారీల దెబ్బకి 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌతాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయకేతనం ఎగరేసింది. భారత మిడిలార్డర్‌ పేకమేడలా కూలడంతో భారత్‌కి ఈ పరిస్థితి వచ్చింది. సౌతాఫ్రికా బౌలర్ల ముందు ఎవ్వరు క్రీజులో నిలవలేకపోయారు. శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, శార్దుల్‌ ఠాగూర్‌ మినహాయించి ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 46 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్ కెఎల్‌ రాహుల్‌ 12 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ జత కలిసారు. ఇరువురు కలిసి స్కోరు బోర్డుని పరుగెత్తించారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ హాప్‌ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అయితే 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్‌ ఔటయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లీ కూడా 60 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. కానీ వెంటనే ఔటయ్యాడు.

తర్వాత వచ్చిన వారు ఎవ్వరూ క్రీజులో నిలదొక్కుకోలేదు. సపారీలు వరుసగా వికెట్లు తీస్తూ పై చేయి సాధించారు. కానీ చివరలో శార్దుల్‌ ఠాగూర్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌ సాయంతో 50 పరుగులు చేశాడు. జస్ప్రీత్‌ బుమ్రా 14 పరుగులతో నిలిచాడు. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. సౌతాఫ్రికా బౌలర్లలో అండిలే పెహ్లుక్‌ వయో 2, లుంగి ఎంగిడి 2, షామ్‌సీ 2, మార్‌క్రమ్‌ 1 వికెట్‌, కేశవ్ మహారాజ్ 1వికెట్‌ సాధించారు.

అంతకు ముందు టాస్‌ మొదటగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా 50 ఓవరల్లో 296 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్‌ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత క్రీజులోకి కెప్టెన్‌ బావుమా, వాన్‌ డస్సెన్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. మెల్ల మెల్లగా ఇన్నింగ్స్‌ నిర్మిస్తూ భారీ స్కోరు దిశగా కదిలారు. ఏకంగా ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్‌ పార్ట్‌నర్ షిప్ 204 పరుగులను సాధించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ టార్గెట్‌ని విధించారు.

భారత్: కెఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, చాహల్

దక్షిణాఫ్రికా: డికాక్(వికెట్ కీపర్), మలన్, బవుమా(కెప్టెన్), మార్కరామ్, డుస్సెన్, మిల్లర్, పెహ్లుక్వాయో, జాన్సన్, మహారాజ్, ఎంగిడి, షంసి

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 19 Jan 2022 10:04 PM (IST)

    భారత్ ఓటమి.. 50 ఓవర్లలో 265/8

    భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా 31 పరుగుల తేడాతో మొదటి వన్డేలో విజయం సాధించింది. భారత్‌ మిడిలార్డర్‌ వైఫల్యం వల్ల ఘోర ఓటమిని చవిచూసింది. సౌతాఫ్రికా బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ భారత్‌ని కోలుకోలేని దెబ్బ తీశారు. వారి బంతుల ముందు ఏ ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో అండిలే పెహ్లుక్‌ వయో 2, లుంగి ఎంగిడి 2, షామ్‌సీ 2, మార్‌క్రమ్‌ 1 వికెట్‌, కేశవ్ మహారాజ్ 1వికెట్‌ సాధించారు.

  • 19 Jan 2022 10:02 PM (IST)

    శార్దుల్‌ ఠాగూర్‌ హాఫ్ సెంచరీ

    శార్దుల్‌ ఠాగూర్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌ సాయంతో 50 పరుగులు చేశాడు. మరోవైపు జస్ప్రీత్‌ బుమ్రా 14 పరుగులతో నిలిచాడు. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.


  • 19 Jan 2022 09:55 PM (IST)

    250 పరుగులు దాటిన భారత్

    భారత్ 48 ఓవరల్లో 250 పరుగులు దాటింది. శార్దుల్ ఠాగూర్‌ 45 పరుగులతో హాఫ్ సెంచరీ చేరువలో ఉన్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా 11 పరుగులతో ఆడుతున్నాడు.

  • 19 Jan 2022 09:30 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ 4 పరుగులకు ఔటయ్యాడు. శాంసీ బౌలింగ్‌లో బావుమా క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 44 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో అండిలే పెహ్లుక్‌ వయో 2, లుంగి ఎంగిడి 2, షామ్‌సీ 2, మార్‌క్రమ్‌ 1 వికెట్‌, కేశవ్ మహారాజ్ 1వికెట్‌ సాధించారు.

     

  • 19 Jan 2022 09:20 PM (IST)

    40 ఓవర్లలో భారత్

    భారత్ 40 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. క్రీజులో శార్దుల్ ఠాగూర్ 12 పరుగులు భువనేశ్వర్ కుమార్ 2 పరుగులతో ఆడుతున్నారు. ఇంకా విజయానికి 58 బంతుల్లో 90 పరుగులు చేయాలి. సౌతాఫ్రికా బౌలర్లలో అండిలే పెహ్లుక్‌ వయో 2, లుంగి ఎంగిడి 2, షామ్‌సీ 1, మార్‌క్రమ్‌ 1 వికెట్‌, కేశవ్ మహారాజ్ 1వికెట్‌ సాధించారు.

  • 19 Jan 2022 09:14 PM (IST)

    200 పరగులు దాటిన భారత్

    భారత్ 39 ఓవర్లలో 200 పరుగులు దాటింది. క్రీజులో శార్దుల్ ఠాగూర్ 7 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 2 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 65 బంతుల్లో 95 పరుగులు చేయాల్సి ఉంది.

  • 19 Jan 2022 09:13 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ ఏడో వికెట్‌ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులకు ఔటయ్యాడు. దీంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. విజయానికి 96 పరుగుల దూరంలో ఉంది.

  • 19 Jan 2022 08:24 PM (IST)

    30 ఓవర్లకు భారత్ 156/3

    భారత్ 30 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్ 5 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్ 3 పరుగులతో ఆడుతున్నారు. ఇంకా విజయానికి 140 పరుగుల దూరంలో ఉంది. కాగా సౌతాఫ్రికా బౌలర్లలో మార్‌క్రమ్‌ 1 వికెట్‌, కేశవ్ మహారాజ్ 1వికెట్‌, షామ్‌సీ 1 వికెట్‌ సాధించాడు.

  • 19 Jan 2022 08:17 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ మూడో వికెట్‌ కోల్పోయింది. విరాట్‌ కోహ్లీ 51 పరుగులకు ఔటయ్యాడు. శామ్‌సీ బౌలింగ్‌లో బావుమా క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. విజయానికి 145 పరుగుల దూరంలో ఉంది. క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్ వచ్చాడు.

  • 19 Jan 2022 08:14 PM (IST)

    హాప్‌ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లీ

    విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 60 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. మరోవైపు రిషబ్‌ పంత్‌ 4 పరుగులతో ఆడుతున్నాడు.

  • 19 Jan 2022 08:06 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ రెండో వికెట్‌ కోల్పోయింది. శిఖర్‌ ధావన్ 79 పరుగులకు ఔటయ్యాడు. మహారాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్ రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది. క్రీజులోకి రిషబ్‌ పంత్ వచ్చాడు.

  • 19 Jan 2022 07:45 PM (IST)

    20 ఓవర్లకి భారత్ 104/1

    భారత్ 20 ఓవర్లకు ఒక వికెట్‌ కోల్పోయి 104 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ 65 పరుగులు, విరాట్ కోహ్లీ 25 పరుగులతో ఆడుతున్నారు. ఇంకా విజయానికి 192 పరుగుల దూరంలో ఉంది. కాగా సౌతాఫ్రికా బౌలర్లలో మార్‌క్రమ్‌ 1 వికెట్‌ సాధించాడు.

  • 19 Jan 2022 07:34 PM (IST)

    100 పరుగులు దాటిన భారత్

    భారత్ 18.2 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్రీజులో శిఖర్ ధావన్ 63 పరుగులు, విరాట్ 24 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 197 పరుగుల దూరంలో ఉంది. ఇరువురు కలిసి రెండో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా సౌతాఫ్రికా బౌలర్లలో మార్‌క్రమ్‌ 1 వికెట్‌ సాధించాడు.

  • 19 Jan 2022 07:18 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ ధావన్

    శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఒక వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 223 పరుగుల దూరంలో ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ 11 పరుగులతో ఆడుతున్నాడు.

  • 19 Jan 2022 07:03 PM (IST)

    10 ఓవర్లకు భారత్ 55/1

    భారత్ 10 ఓవర్లకు ఒక వికెట్‌ కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ 39 పరుగులు, విరాట్ కోహ్లీ 4 పరుగులతో ఆడుతున్నారు. ఇంకా విజయానికి 242 పరుగుల దూరంలో ఉంది.

  • 19 Jan 2022 07:00 PM (IST)

    50 పరుగులు దాటిన భారత్

    భారత్ 9 ఓవర్లలో 50 పరుగులు దాటింది. క్రీజులో శిఖర్ ధావన్ 34 పరుగులు, విరాట్ కోహ్లీ 4 పరుగులతో ఆడుతున్నారు.

  • 19 Jan 2022 06:59 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ మొదటి వికెట్‌ కోల్పోయింది. కెఎల్‌ రాహుల్ 12 పరుగులకు ఔటయ్యాడు. మార్క్‌క్రమ్‌ బౌలింగ్‌లో డికాక్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది.

  • 19 Jan 2022 06:28 PM (IST)

    బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇండియా

    297 పరుగుల లక్ష్యంతో టీం ఇండియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా శిఖర్ ధావన్, కెఎల్‌ రాహుల్ బరిలోకి దిగారు.

  • 19 Jan 2022 05:56 PM (IST)

    50 ఓవర్లకు సౌతాఫ్రికా 296/4

    50 ఓవర్లకు సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత్‌కి 297 పరుగుల టార్గెట్‌ విధించింది. కెప్టెన్‌ టెంబా బావుమా, వాన్‌ డస్సెన్‌లు సెంచరీలతో చెలరేగడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నాలుగో వికెట్‌కి ఏకంగా 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ బౌలర్లు వీరి జంటని విడదీయడంలో విఫలమయ్యారు. ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. జస్ప్రీత్‌ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్‌ అశ్విన్ ఒక వికెట్‌ సాధించారు.

  • 19 Jan 2022 05:45 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. టెంబా బావుమా 110 పరుగులకు ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్‌ తీసుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు.

  • 19 Jan 2022 05:39 PM (IST)

    రస్సెన్ వాన్‌ డస్సెన్ సెంచరీ

    రస్సెన్ వాన్‌ డస్సెన్ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 8ఫోర్లు 2సిక్స్‌ల సహాయంతో 100 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్ బావుమా 110 పరుగులతో ఆడుతున్నాడు. ఇరువురు కలిసి నాలుగో వికెట్‌కి 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ స్కోరు దిశగా వెళుతున్నారు.

  • 19 Jan 2022 05:30 PM (IST)

    250 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 45.4 ఓవర్లలో 250 పరుగులు దాటింది. క్రీజులో బావుమా 105 పరుగులు, డస్సెన్ 97 పరుగులతో ఆడుతున్నారు. భారీ స్కోరు దిశగా వెళుతున్నారు.

  • 19 Jan 2022 05:26 PM (IST)

    45 ఓవర్లకు సౌతాఫ్రికా 245/3

    45 ఓవర్లకు సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. క్రీజులో సెంచరీ హీరో బావుమా 100 పరుగులు, డస్సెన్ 93 పరుగులతో ఆడుతున్నారు. నాలుగో వికెట్‌కి 177 పరుగులు జోడించారు.

  • 19 Jan 2022 05:23 PM (IST)

    సెంచరీ సాధించిన కెప్టెన్ టెంబా బావుమా

    సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా సెంచరీ సాధించాడు. 133 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 44.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. మరోవైపు వాన్‌ డస్సెన్ కూడా 76 పరుగులతో సెంచరీ దిశగా ఆడుతున్నాడు. పేలవమైన భారత బౌలింగ్‌ క్రికెట్‌ అభిమానులను చాలా నిరాశపరుస్తోంది.

  • 19 Jan 2022 05:09 PM (IST)

    నాలుగో వికెట్‌కి 150 పరుగుల భాగస్వామ్యం

    కెప్టెన్ టెంబా బావుమా, రస్సెన్ వాన్‌ డస్సెన్ నాలుగో వికెట్‌కి 143 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో సౌతాఫ్రికా 40.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

  • 19 Jan 2022 05:03 PM (IST)

    40 ఓవర్లకు సౌతాఫ్రికా 210/3

    సౌతాఫ్రికా 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో టెంబా బావుమా 89 పరుగులు, డస్సెన్ 70 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ సాధించారు.

  • 19 Jan 2022 04:57 PM (IST)

    200 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 38.4 ఓవర్లలో 200 పరుగులు దాటింది. క్రీజులో డస్సెన్‌ 65 పరుగులు, బావుమా 86 పరుగులతో ఆడుతున్నారు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ సాధించారు.

  • 19 Jan 2022 04:40 PM (IST)

    రస్సెన్ వాన్‌ డస్సెన్ హాఫ్ సెంచరీ

    రస్సెన్ వాన్‌ డస్సెన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 49 బంతుల్లో 4 ఫోర్ల 1 సిక్స్‌ సహాయంతో 54 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్ బావుమా 72 పరుగులతో ఆడుతున్నాడు. ఇరువురు కలిసి నాలుగో వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  • 19 Jan 2022 04:37 PM (IST)

    నాలుగో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం

    కెప్టెన్ టెంబా బావుమా, రస్సెన్ వాన్‌ డస్సెన్ నాలుగో వికెట్‌కి 99 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో సౌతాఫ్రికా 33.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

  • 19 Jan 2022 04:20 PM (IST)

    150 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 30.4 ఓవరల్లో 150 పరుగులు దాటింది. క్రీజులో టెంబా బావుమా 63 పరుగులు, రస్సెన్ వాన్‌ డస్సెన్ 40 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.

  • 19 Jan 2022 04:17 PM (IST)

    30 ఓవర్లకు సౌతాఫ్రికా 148/3

    సౌతాఫ్రికా 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. క్రీజులో టెంబా బావుమా 62 పరుగులు, రస్సెన్ వాన్‌ డస్సెన్ 39 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ సాధించారు.

  • 19 Jan 2022 04:05 PM (IST)

    హాఫ్ సెంచరీ సాధించిన కెప్టెన్ టెంబా బావుమా

    టెంబా బావుమా హాఫ్ సెంచరీ సాధించాడు. 76 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. మరోవైపు రస్సెన్ వాన్‌ డస్సెన్ 30 పరుగులతో చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇరువురు కలిసి నాలుగో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  • 19 Jan 2022 03:48 PM (IST)

    100 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 22 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్రీజులో డస్సెన్‌ 27 పరుగులు, బావుమా 33 పరుగులతో ఆడుతున్నారు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ సాధించారు.

  • 19 Jan 2022 03:34 PM (IST)

    20 ఓవర్లకు సౌతాఫ్రికా 80/3

    సౌతాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బావుమా 27 పరుగులు, డస్సెన్ 7 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ సాధించారు.

  • 19 Jan 2022 03:25 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. మార్‌క్రమ్‌ 4 పరుగులకు ఔటయ్యాడు. వెంకటేశ్‌ అయ్యార్ రన్‌ అవుట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.

  • 19 Jan 2022 03:17 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. క్వింటన్ డికాక్ 27 పరుగులకు ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులోకి మార్‌క్రమ్‌ వచ్చాడు.

  • 19 Jan 2022 03:02 PM (IST)

    50 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 50 పరుగులు దాటింది. క్రీజులో క్వింటాన్‌ డికాక్ 23 పరుగులు, బావుమా 15 పరుగులతో ఆడుతున్నారు. దీంతో సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది.

  • 19 Jan 2022 02:25 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా మొదటి వికెట్‌ కోల్పోయింది. జానెమన్ మలన్ 6 పరుగులకు ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఒక వికెట్‌ నష్టానికి 19 పరుగులు చేసింది. క్రీజులోకి బావుమా వచ్చాడు.

  • 19 Jan 2022 02:10 PM (IST)

    మొదటి ఓవర్‌లో 6 రన్స్..

    సఫారీలకు తొలి ఓవర్‌లో శుభారంభం చేసారు. ఓవర్ ముగిసేసరికి 6 పరుగులు రాబట్టాయి. ఇందులో 5 పరుగులు ఎక్స్ ట్రాలు గా వచ్చాయి. కేవలం ఒక్క పరుగు మాత్రం డికాక్ చేశాడు. ప్రస్తుతం డికాక్(1), మలన్(0)తో క్రీజులో ఉన్నారు.

  • 19 Jan 2022 02:07 PM (IST)

    ఆల్ రౌండర్‌గా వెంకటేష్ అయ్యర్..

    అటు హార్దిక్ పాండ్యా.. ఇటు రవీంద్ర జడేజా జట్టులో లేకపోవడంతో.. ఐపీఎల్‌లో అదరగొట్టిన వెంకటేష్ అయ్యర్.. వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. చూడాలి ఈ మ్యాచ్‌లో అతడు ఎలాంటి ఆటతీరును కనబరుస్తాడో.

  • 19 Jan 2022 02:05 PM (IST)

    దక్షిణాఫ్రికా తుది జట్టు..

    దక్షిణాఫ్రికా: డికాక్(వికెట్ కీపర్), మలన్, బవుమా(కెప్టెన్), మార్కరామ్, డుస్సెన్, మిల్లర్, పెహ్లుక్వాయో, జాన్సన్, మహారాజ్, ఎంగిడి, షంసి

  • 19 Jan 2022 02:05 PM (IST)

    టీమిండియా తుది జట్టు..

    భారత్: కెఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, చాహల్

  • 19 Jan 2022 02:04 PM (IST)

    వన్డే సమరం మొదలైంది..

    భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సమరం మొదలైంది. టెస్ట్ సిరీస్ ఓటమితో.. రివెంజ్ కోసం టీమిండియా తహతహలాడుతుండగా.. ఈ వన్డే సిరీస్ విజయంతో మొదలు పెట్టాలని సఫారీలు భావిస్తున్నారు.

Follow us on