IND vs SA 5th T20I: నేడు ఐదో టీ-20 మ్యాచ్.. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు వరుడ గండం!

|

Jun 19, 2022 | 5:13 PM

సిరీస్ 2-2 తో సమానంగా ఉన్న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వరణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించంది. కానీ క్రికెట్ ప్రేమికులు వర్షం కురవదని.. పరుగుల వర్షం మాత్రమే కురుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

IND vs SA 5th T20I: నేడు ఐదో టీ-20 మ్యాచ్.. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు వరుడ గండం!
Ind Vs Sa 5th T20i
Follow us on

IND vs SA 5th T20I: నేడు బెంగళూరు వేదికగా భారత్ ,దక్షిణాఫ్రికాల జరగనున్న ఐదో టీ-20 మ్యాచ్ పైనే అందరి దృష్టి.. ఎందుకంటే భారత్,  దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్నాయి. దీంతో ఈరోజు బెంగళూరులో జరగనున్న మ్యాచ్ సిరీస్ నిర్ణయాత్మకంగా మారింది.  ఈ సీరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు ఢిల్లీ, కటక్ మ్యాచుల్లో సఫారీలు గెలుపొంది..  భారత్‌ను పతనం అంచుననిలిపారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు..  విశాఖ, రాజ్‌కోట్‌ల్లో జరిగిన రెండు మ్యాచుల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుని.. సిరీస్ ను 2-2 తో సమం చేసింది. దీంతో నేటి మ్యాచ్ ఇరుజట్లకు నిర్ణయాత్మకంగా మారింది.

ఈ తుదిపోరుకు వరుణుడు ఆటంకి కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో చిన్నస్వామి స్టేడియం ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని  బెంగళూరు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలో 68% అవపాతం పడే అవకాశం ఉంది.. అందువల్ల మ్యాచ్ వర్షం వల్ల ప్రభావితమవుతుంది. గత వారం రోజులుగా బెంగళూరులో కురుస్తోన్న వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..

అయితే క్రికెట్ ప్రేమికులు మాత్రం వర్షం పడదని.. మ్యాచ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. దినేష్ కార్తీక్  ఈ రాత్రి బౌండరీల వర్షం కురిపించవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..