IND vs SA 1st Test: కోల్‌కతా టెస్ట్ పిచ్ రిపోర్ట్..టాస్ గెలిచిన టీమ్ ఏం ఎంచుకుంటుంది?

భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు నేటి నుంచి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ మైదానంలో గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌లలో భారత్ 2 సార్లు విజయం సాధించింది.

IND vs SA 1st Test: కోల్‌కతా టెస్ట్ పిచ్ రిపోర్ట్..టాస్ గెలిచిన టీమ్ ఏం ఎంచుకుంటుంది?
Eden Gardens

Updated on: Nov 14, 2025 | 7:00 AM

IND vs SA 1st Test: భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు నేటి నుంచి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ మైదానంలో గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌లలో భారత్ 2 సార్లు విజయం సాధించింది. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? బ్యాట్స్‌మెన్‌లకు, బౌలర్లకు ఎప్పుడు, ఎంతవరకు సహాయం అందుతుంది? ఏ జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.

ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను పరిశీలిస్తే ఇది ఆటలోని వివిధ దశలలో బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్‌లు ఇద్దరికీ సహాయకారిగా ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ చరిత్ర ప్రకారం బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకుంటే తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు చేయడం చాలా సులభం అవుతుంది. అయితే మూడో, నాలుగో ఇన్నింగ్స్‌లలో పిచ్ పాతబడుతుంది. దీంతో బంతి బాగా తిరుగుతుంది ఫలితంగా చివరి 3 రోజులలో పరుగులు చేయడం చాలా కష్టం అవుతుంది.

మొదటి రెండు ఇన్నింగ్స్‌లలో సగటు స్కోర్ 300 పరుగుల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ మూడో ఇన్నింగ్స్‌లో ఇది 250, నాలుగో ఇన్నింగ్స్‌లో 200 పరుగుల మార్కును చేరుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది.

ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రారంభ రోజుల్లో ఫాస్ట్ బౌలర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ ప్రారంభంలో పిచ్‌పై పచ్చిక ఉన్న కారణంగా ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. దీనివల్ల తొలి రోజుల్లో బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు చాలా ప్రమాదకరంగా మారవచ్చు. మూడో రోజు నుంచి పిచ్ పాతబడటం మొదలుకాగానే, స్పిన్ బౌలర్ల ప్రభావం పెరుగుతుంది. సౌతాఫ్రికా జట్టులో ఉన్న కేశవ్ మహరాజ్ వంటి స్టార్ స్పిన్నర్లు ఆఖరి రోజుల్లో భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

పిచ్ స్వభావం దృష్ట్యా ఈ టెస్ట్‌లో టాస్ గెలవడం చాలా కీలకం. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోయిష్ అభిప్రాయం ప్రకారం.. ఈ పిచ్‌పై స్పిన్నర్ల పాత్ర ముఖ్యమైనదిగా ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని, తొలి 2 రోజుల్లోనే భారీ స్కోర్ సాధించడానికి ప్రయత్నించవచ్చు. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం వల్ల, తొలి ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోర్ చేసిన జట్టుకు చివరి రోజుల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి, విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..