Telugu News Sports News Cricket news Ind vs Pak: Virat Kohli, Babar Azam catch up ahead of India,Pakistan Asia Cup tie internet reacts 'Can't see anything better' Telugu Cricket News
Ind vs Pak, Asia Cup 2022: మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు జట్లు కూడా యూఏఈ చేరుకున్నాయి.
Ind vs Pak, Asia Cup 2022: మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు జట్లు కూడా యూఏఈ చేరుకున్నాయి. ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli), పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) కలుసుకున్నారు. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈనేపథ్యంలో కోహ్లీ, బాబర్ కలిసున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిని చూసిన వారంతా ‘పిక్చర్ ఆఫ్ ది డే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌ల పైనే ఉంది. ప్రస్తుతం విరాట్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. మళ్లీ తన మునపటి ఫామ్‌ను అందుకునేందుకు ఆసియాకప్‌ను వేదికగా మార్చుకోవాలనుకుంటున్నాడు. అదే సమయంలో బాబర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌చేతిలో ఓడిన తర్వాత భారత జట్టు తొలిసారిగా ముఖాముఖి తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పొట్టి ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చు్కోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా ప్రాక్టీస్ సెషన్‌లో భారత ఆటగాళ్లు అఫ్గానిస్థాన్ క్రికెటర్లను కూడా కలిశారు. యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా రషీద్ ఖాన్ సహా ఆఫ్ఘన్ ఆటగాళ్లతో చాలా సేపు గడిపారు. ఇక ఈ మల్టీ నేషన్ టోర్నమెంట్‌లో టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడడంతో తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్‌ను నియమించింది బీసీసీఐ.