IND vs PAK: పాక్‌పై చెత్త స్కోర్ నమోదు చేసిన భారత్.. టీ20 చరిత్రలోనే..

|

Jun 09, 2024 | 11:36 PM

IND vs PAK, T20 World Cup 2024: న్యూయార్క్‌లో జరుగుతున్న గ్రూప్-ఎ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20ల్లో లో స్కోర్‌ను నమోదు చేసింది.

IND vs PAK: పాక్‌పై చెత్త స్కోర్ నమోదు చేసిన భారత్.. టీ20 చరిత్రలోనే..
India Vs Pakistan Lowest Score
Follow us on

Team India Lowest T20I Score Against Pakistan: ఆదివారం న్యూయార్క్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ తన అత్యల్ప టీ20ఐ స్కోరును నమోదు చేసింది.

గ్రూప్-ఏ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. 2012లో బెంగళూరులో 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. పాక్ జట్టుపై ఇది మునుపటి లో స్కోరుగా నిలిచింది.

భారత్ ఒక దశలో మూడు వికెట్లకు 89 పరుగుల వద్ద బలంగానే కనిపించింది. అయితే ఏడు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి పాకిస్తాన్‌ను తిరిగి పోటీలోకి దూసుకొచ్చింది.

రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు చేసి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. తర్వాతి అత్యుత్తమ ఆటగాడు అక్షర్ పటేల్ 20 పరుగులు చేశాడు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..