టీమిండియాపై అరంగేట్రం.. నీకిదే చివరి మ్యాచ్ అంటూ పాక్ ప్లేయర్‌కి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే..

|

Dec 17, 2022 | 9:14 AM

మరోసారి సంచలన వ్యాఖ్యలతో పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఇంటర్నెట్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు..

టీమిండియాపై అరంగేట్రం.. నీకిదే చివరి మ్యాచ్ అంటూ పాక్ ప్లేయర్‌కి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే..
Saeed Ajmal
Follow us on

మరోసారి సంచలన వ్యాఖ్యలతో పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఇంటర్నెట్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. 2008లో టీమిండియాపై వన్డేల్లో అరంగేట్రం చేసినప్పుడు, సెలెక్టర్లు తనకు ఇదే మొదటి, ఆఖరి మ్యాచ్ అని వార్నింగ్ ఇచ్చారని అజ్మల్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘నేను జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు.. నా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, టీమిండియా తలబడ్డాయి. ఇక అదే నా మొదట, చివరి మ్యాచ్ అని అరంగేట్రానికి ముందు సెలెక్టర్లు చెప్పారు. మాలిక్, మిస్బా వల్ల తాను జట్టులోకి ఎంపికయ్యానని.. పెర్ఫామ్ చేస్తేనే తదుపరి మ్యాచ్‌లు ఆడతాడు. లేకపోతే బయటికే అని అన్నారు’.

‘నేను బరిలోకి దిగినప్పుడు.. మొదటి 10 ఓవర్లలో సమయంలో నాకు తిమ్మిరి ఏర్పడింది. ఆ సమయంలో మిస్బా కెప్టెన్‌గా ఉన్నాడు. పవర్‌ప్లేలో నువ్వు బౌలింగ్ చేయాలని చెప్పాడు. నాకు కండరాలు పట్టేశాయని.. మైదానం త్వరగా వీడతానని చెప్పగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో కూడా నువ్వు బౌలింగ్ వెయ్యాలని అతడు చెప్పాడు. దీంతో ఆ మ్యాచ్‌లో సయీద్ అజ్మల్ తొలి ఐదు ఓవర్లు వేశాక, మళ్ళీ బౌలింగ్ చేయలేదు. ఆ తర్వాత చివర్లో బ్యాండేజీ వేసుకుని వచ్చి 3-4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కానీ అతడి కండరాలు బిగుసుకుపోయినా.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

కాగా, కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 308 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని పాకిస్థాన్ 45.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సయీద్ అజ్మల్ 10 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే సమయంలో యూనిస్ ఖాన్ అజేయంగా 123 పరుగులు, మిస్బా ఉల్ హక్ అజేయంగా 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.