IND vs PAK ICC World Cup 2023 Highlights: 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన భారత్.. హిట్‌మ్యాన్, శ్రేయాస్ సూపర్బ్ ఇన్నింగ్స్..
IND vs PAK, ICC world Cup 2023 Highlights: ODI ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ 8వ సారి తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్థాన్‌పై ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వరుస విజయాల పరంపర కొనసాగించాలని టీమ్ ఇండియా ప్రయత్నిస్తే.. పాక్ మాత్రం తొలి విజయంపై ఆశలు పెట్టుకుంది.

IND vs PAK, ICC world Cup 2023 Highlights Updates: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ 8వ సారి కూడా భారత్‌పై విజయం సాధించలేకపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన విజయాల జైత్రయాత్రను కొనసాగించింది.
192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 31 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్‌కు శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
పాక్ బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్ అజామ్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఐదుగురు భారత బౌలర్లు తలో 2 వికెట్లు తీశారు. భారత్‌లో రోహిత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ 53 పరుగులు చేశాడు. షాహీన్ షా ఆఫ్రిది అత్యధికంగా 2 వికెట్లు తీశాడు.
పాక్‌పై టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనే నిర్ణయం భారత్‌కు సరైనదని రుజువైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 191 పరుగులకు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.
పాక్ తరపున కెప్టెన్ బాబర్ ఆజం అర్ధశతకం సాధించాడు. వన్డేల్లో భారత్‌పై అతనికిదే తొలి అర్ధశతకం. 49 పరుగుల వద్ద రిజ్వాన్ ఔటయ్యాడు.
వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో అతిపెద్ద మ్యాచ్ అంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ హ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్తాన్ టీం తొలుత బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైంది.
అయితే, టీమిండియా ప్లేయింగ్‌లోకి శుభ్‌మన్ గిల్ తిరిగి వచ్చాడు. అతను ఇషాన్ కిషన్ స్థానంలో ఆడనున్నాడు. మిగతా టీంలో ఎలాంటి మార్పు లేదు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
LIVE Cricket Score & Updates
-
ఘనమైన 8వ విజయం..
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ 8వ సారి కూడా భారత్‌పై గెలవలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన వరుస విజయాల పరంపరను కొనసాగించింది
-
రోహిత్ ఔట్..
రోహిత్ శర్మ 86 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. షాహీన్ బౌలింగ్‌లో ఇఫ్తికర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా 21.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. విజయానికి మరో 36 పరుగులు కావాల్సి ఉంది.
-
-
రోహిత్, శ్రేయాస్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..
రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ జోడీ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన భారత్.. 142 పరుగులు చేసింది. రోహిత్ 80, శ్రేయాస్ 28 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
100కు చేరిన స్కోర్..
టీమిండియా 14 ఓవర్లు ముగిసే సరికి 101 పరుగులకు చేరుకుంది. 2 వికెట్లు కోల్పోయిన భారత్.. విజయానికి మరో 91 పరుగులు కావాల్సి ఉంది. రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
-
కోహ్లీ ఔట్..
9.5 ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన విరాట్ కోహ్లీ (16) హషన్ అలీ బౌలింగ్‌లో నవాజ్ చేతికి చిక్కాడు. దీంతో టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది.
-
-
రోహిత్ @ 300 సిక్సులు
రోహిత్ శర్మఅంతర్జాతీయ ఫార్మాట్‌లో 300 సిక్సులు కొట్టాడు. దీంతో అందరికంటే టాప్‌లో నిలిచాడు.
-
50 పరుగులకు చేరిన భారత్..
టీమిండియా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతోంది. 7కి పైగా రన్ రేట్‌తో పరుగులు సాధిస్తోంది. ఈ క్రమంలో 7 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు సాధించింది. విరాట్ 13, రోహిత్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
టీమిండియాకు తొలి రెండు ఓవర్లలోనే అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే, మూడో ఓవర్‌లో షాహీన్ బౌలింగ్‌లో టీమిండియా ఫ్యూచర్ స్టార్ శుభ్మన్ గిల్ (16) పెవిలియన్ చేరాడు.
-
పాకిస్తాన్ ఆలౌట్..
పాక్‌పై టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనే నిర్ణయం భారత్‌కు సరైనదని రుజువైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 191 పరుగులకు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.
పాక్ తరపున కెప్టెన్ బాబర్ ఆజం అర్ధశతకం సాధించాడు. వన్డేల్లో భారత్‌పై అతనికిదే తొలి అర్ధశతకం. 49 పరుగుల వద్ద రిజ్వాన్ ఔటయ్యాడు.
-
బౌలర్ల సత్తా.. 9 వికెట్లు డౌన్..
టీమిండియా బౌలర్లు సత్తా చాటుతున్నారు. దీంతో పాక్ ఓ దశలో చాలా బలంగా కనిపించినా.. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కోల్పోతూ కష్టాల్లో కూరుకపోయింది. ప్రస్తుతం పాక్ 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.
-
పెవిలియన్ చేరిన డేంజరస్ రిజ్వాన్..
హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న పాక్ కీపర్ రిజ్వాన్ (49)ను బుమ్రా అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. దీంతో పాక్ 34 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
-
కుల్దీప్ మ్యాజిక్..
కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్‌తో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాక్ 33 ఓవర్లు మిగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. తొలుత షకీల్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చిన కుల్దీప్.. చివరి బంతికి ఇఫ్తికార్‌ను బౌల్డ్ చేశాడు.
-
నాలుగో వికెట్ డౌన్..
కుల్దీప్ తన అద్భుతమైన బంతితో షకీల్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో పాకిస్తాన్ టీం 32.2 ఓవర్లలో 162 పరుగులు చేసింది.
-
బాబర్ హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్‌కు
పేలవ ఫాంతో బాధపడుతున్న బాబర్ అజాం(50, 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఫాంలోకి వచ్చాడు. ఆ తర్వాత సిరాజ్ అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో పాక్ 29.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
-
25 ఓవర్లకు పాక్ స్కోర్..
25 ఓవర్లు ముగిసే సరికి పాక్ టీం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 125 పరుగులు సాధించింది. పాక్ డేంజరస్ బ్యాటర్స్ రిజ్వాన్ (33), బాబర్ (35) జోడీ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు.
-
సెట్ చేసుకుంటున్న బాబర్, రిజ్వాన్ జోడీ..
16 ఓవర్లు ముగిసే సరికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు సాధించింది. బాబర్ 23, రిజ్వాన్ 8 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
రెండో వికెట్ డౌన్..
12.3 ఓవర్‌లో పాకిస్తాన్ రెండో వికెట్‌ను కోల్పోయింది. హార్దిక్ బౌలింగ్‌లో ఇమామ్ ఇచ్చిన అద్భుమైన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ ఒడిసి పట్టడంతో 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు.
-
11 ఓవర్లకు పాక్ స్కోర్..
11 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. బాబర్ 14, ఇమామ్ 25 పరుగులతో నిలిచారు.
-
పవర్ ప్లేలో సిరాజ్ హవా..
2022 నుంచి చూసుకుంటే హైదరాబాద్ బౌలర్ సిరాజ్ తన సత్తా చాటుతున్నాడు. ఆడిన 30 ఇన్నింగ్స్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన పాక్..
ఎట్టకేలకు భారత బౌలర్లకు వికెట్ లభించింది. సిరాజ్ తన నాలుగో ఓవర్లో షఫీక్(20)ను ఎల్బీగా పెవిలియ్ చేర్చాడు.
-
భారత్ vs పాకిస్థాన్ – ప్రపంచకప్ ఫలితాలు..
1992 – సిడ్నీలో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది1996 – బెంగళూరులో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది
1999 – మాంచెస్టర్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది
2003 – సెంచూరియన్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది
2011 – మొహాలీలో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది
2015 – అడిలైడ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది
2019 – మాంచెస్టర్‌లో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది
-
5 ఓవర్లకు పాక్‌దే పైచేయి..
5 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు సాధించింది.
-
సిరాజ్ ఓవర్లో భారీగా పరుగులు..
రెండో ఓవర్ వేసిన సిరాజ్.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి పాక్ 16 పరుగులు చేసింది.
-
బుమ్రా తొలి ఓవర్‌లో 4 పరుగులు..
బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో చివరి బంతికి పాక్ బౌండరీతో తన ఖాతా తెరిచింది.
-
IND vs PAK Live Score లైవ్ స్కోర్..
-
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
-
IND vs PAK Live Score: టాస్ గెలిచిన టీమిండియా..
రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ బ్యాటింగ్ చేయనుంది.
-
స్టేడియానికి చేరుకున్న ఆటగాళ్లు..
READY! 🙌
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/NEGucWYnhO
— BCCI (@BCCI) October 14, 2023
-
పిచ్ నివేదిక..
సంజయ్ మంజ్రేకర్, మాథ్యూ హేడెన్ పిచ్ నివేదికలో మాట్లాడుతూ, పరుగుల వర్షం కురవనుందని తెలిపారు. ఇది బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన పిచ్. ఇందులో 300 కంటే ఎక్కువ పరుగులు చేస్తారని పేర్కొన్నారు.
-
మ్యూజిక్ ఈవెంట్ కేవలం స్టేడియంలోని అభిమానులకే..
The pre-match ceremony for the #INDvPAK game today will not be televised as it is only for the stadium audience. We have you covered for the rest- the match, the highlights & everything in between!
Tune-in to #INDvPAK in the #WorldCupOnStar LIVE NOW | Star Sports Network pic.twitter.com/XOVcJoTrma
— Star Sports (@StarSportsIndia) October 14, 2023
-
స్టేడియానికి భారీగా చేరుకున్న అభిమానులు..
Sea of Indian fans at Narendra Modi Stadium.
– Madness…..!!!!!!pic.twitter.com/hOq9J5BftC
— Johns. (@CricCrazyJohns) October 14, 2023
-
నరేంద్ర మోడీ స్టేడియంలో జ’వ’న జాతర..
బిగ్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంకు చేరుకుంది. త్వరలో టీమ్ ఇండియా కూడా రానుంది. అప్పటికే స్టేడియం బయట భారీగా జనం గుమిగూడారు. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని స్పష్టం చేసింది.
-
స్టేడియానికి PCB చీఫ్..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జాకా అష్రాఫ్ కూడా రానున్నారు. ఇందుకోసం పీసీబీ చీఫ్ ఒకరోజు ముందుగానే అహ్మదాబాద్ చేరుకున్నారు. బీసీసీఐ అధికారులంతా అతనితో కలిసి డిన్నర్ కూడా చేశారనే వార్తలు వచ్చాయి.
-
రోహిత్, ఇషాన్‌లకు ప్రత్యేక మ్యాచ్
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు రికార్డు సృష్టించేందుకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో 300 సిక్సర్లు పూర్తి చేసేందుకు రోహిత్ శర్మకు మరో 3 సిక్సర్లు అవసరం కాగా, ఇషాన్ కిషన్ వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసేందుకు మరో 67 పరుగులు చేయాల్సి ఉంది.
-
భారత్-పాక్ ప్రపంచకప్ ప్రయాణం..
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. చివరిగా ఆడిన 2 మ్యాచ్‌ల్లో రెండు జట్లూ గెలిచాయి.
-
స్పెషల్ ప్రోగ్రాం..
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఈరోజు మ్యాచ్‌కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో గాయకులు అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్ సహా ప్రముఖులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:10 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ కూడా స్టేడియంలో హాజరుకానున్నారు.
-
8వ సారి ముఖాముఖి..
వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌లు 8వ సారి తలపడనున్నాయి. గత 7 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. అంటే వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్‌పై పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
Published On - Oct 14,2023 12:19 PM




