IND vs PAK: పాక్‌తో ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.. ఫొటోలు లీక్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..

|

Aug 27, 2022 | 12:41 PM

India Playing XI vs Pak, Asia Cup 2022: టీమ్ ఇండియా నెట్ సెషన్‌కు సంబంధించిన 10 ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. ఆ తర్వాత ఈ 11 మంది ఆటగాళ్లే ఆదివారం నాడు మైదానంలోకి అడుగుపెడతారని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు.

IND vs PAK:  పాక్‌తో ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.. ఫొటోలు లీక్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
Ind Vs Pak India Playing Xi
Follow us on

ఆసియాకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆగస్టు 28న అంటే ఆదివారం మ్యాచ్‌ జరగనుంది. సమయం గడుస్తున్న కొద్దీ, భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ గురించి చర్చ జోరందుకుంది. ఇంతలో బీసీసీఐ భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను బోర్డు లీక్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నెట్టింట్లో రచ్చ చేస్తోన్న ప్రాక్టీస్ సెషన్ ఫొటోలు..

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా నెట్ సెషన్‌కు సంబంధించిన 10 ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. ఆ తర్వాత ఈ 11 మంది ఆటగాళ్లే ఆదివారం నాడు మైదానంలోకి అడుగుపెడతారని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. BCCI తొలి ఫొటోలో KL రాహుల్, రోహిత్ శర్మ కనిపించారు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

పాకిస్థాన్‌పై పోరాటానికి సిద్ధం..

ఈ ఫోటోల ద్వారా బీసీసీఐ ప్లేయింగ్ ఎలెవన్‌ను సూచించిందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అదే సమయంలో ప్లేయింగ్ 11 లీక్ అయిందని మరో యూజర్ తెలిపాడు. ఆసియా కప్ భారత జట్టులో దీపక్ హుడా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ కూడా ఉన్నారు. బాబర్ అజామ్ జట్టుతో భారత జట్టు తన పోరాటాన్ని ప్రారంభించనుంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓడిన 10 వికెట్లను సమం చేసేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా కూడా ప్రయత్నిస్తోంది. గ్రూప్‌-ఎలో తమ రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌తో టీమిండియా తలపడనుంది.

హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రపంచం..

ఆసియా కప్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ విలేకరుల సమావేశంలో పాల్గొని పాకిస్తాన్‌తో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ గురించి బహిరంగంగా మాట్లాడారు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాహుల్ చెప్పుకొచ్చాడు. అభిమానుల్లాగే తాను కూడా ఈ మ్యాచ్‌లో వచ్చే భావోద్వేగాలకు దూరంగా ఉండలేనని తెలిపాడు. ఆ ప్రత్యేకమైన రోజున 100 శాతం ఔట్‌ఫుట్ ఇస్తామని రాహుల్ తెలిపాడు.