IND vs NZ : ఉప్పల్‌లో అదరగొట్టిన భారత్.. న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. బ్రేస్‌వెల్ మెరుపు సెంచరీ వృథా
మైఖెల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140 12 ఫోర్లు, 10 సిక్స్‌లు), శాంట్నర్ (45 బంతుల్లో 57 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆఖరి వరకు క్రీజులో ఉండి భారత బౌలర్లకు వెన్నులో వణకు తెప్పించారు. అయితే చివరి ఓవర్‌లో ఓ అద్భుత బంతితో శార్దూల్ బ్రేస్‌వెల్‌ను ఔట్ చేయడంతో 49.2 ఓవర్లలో 337 పరుగులకే ఆ జట్టు ఆలౌటౌంది
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు అసలైన మజా లభించింది. ఉప్పల్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ జట్టు అద్భుతంగా పోరాడింది. మైఖెల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140 12 ఫోర్లు, 10 సిక్స్‌లు), శాంట్నర్ (45 బంతుల్లో 57 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆఖరి వరకు క్రీజులో ఉండి భారత బౌలర్లకు వెన్నులో వణకు తెప్పించారు. అయితే చివరి ఓవర్‌లో ఓ అద్భుత బంతితో శార్దూల్ బ్రేస్‌వెల్‌ను ఔట్ చేయడంతో 49.2 ఓవర్లలో 337 పరుగులకే ఆ జట్టు ఆలౌటౌంది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సొంతగడ్డపై నాలుగు వికెట్లతో చెలరేగి కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసి అతనికి సహకరించాడు. కాగా ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. డబుల్ సెంచరీతో టీమిండియా భారీస్కోరకు బాటలు వేసిన యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
రాణించిన సిరాజ్..
350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. డెవాన్ కాన్వే (10)ను ఆరంభంలోనే ఔట్ చేసి కివీస్‌కు షాక్ ఇచ్చాడు. అయితే ఫిన్ అలెన్ (40) చెలరేగి ఆడాడు. అయితే అలెన్ వికెట్ పడగొట్టి టీమిండియా బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, షమీ విజృంభించడంతో ఒకానొక దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో కలిసి మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన బ్రేస్ వెల్ 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు మిచెల్ సాంట్నర్ 38 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. దీంతో చివరి 5 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు విజయానికి 59 పరుగులు మాత్రమే సాధించాల్సి వచ్చింది. ఈ దశలో సాంట్నార్ వికెట్ తీసి మరోసారి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు సిరాజ్. ఆ తర్వాత హెన్రీ షిప్లీని కూడా బౌల్డ్ చేసి పర్యాటక జట్టుకు వరుస షాక్‌ల ఇచ్చాడు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా బ్రేస్‌వెల్ మరింత చెలరేగి ఆడాడు. హార్దిక్ వేసిన 46 వ ఓవర్‌లో 2 భారీ సిక్సర్లు బాదిన బ్రేస్‌వెల్ షమీ వేసిన 47వ ఓవర్‌లో 17 పరుగులు చేసి టీమిండియా శిబిరంలో వణుకు పుట్టించాడు. అయితే 49 ఓవర్ 3 బంతికి హార్దిక్ లూకీ ఫెర్గూసన్ వికెట్ పడగొట్టడం, చివరి ఓవర్‌లో షార్దూల్ బ్రేస్‌వెల్‌ను ఔట్ చేయడంతో భారత జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
A high scoring thriller in Hyderabad!#TeamIndia clinch a 12-run victory and take a 1️⃣-0️⃣ lead in the #INDvNZ ODI series ??
Scorecard ▶️ https://t.co/DXx5mqRguU @mastercardindia pic.twitter.com/aQdbf25By4
— BCCI (@BCCI) January 18, 2023
మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..