Mohammad Shami: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో మహ్మద్ షమీ గురించి అడిగిన ప్రశ్నలకు విరాట్ కోహ్లీ సమాధానమిచ్చాడు. పాకిస్థాన్‌పై ఓటమి తర్వాత, మహ్మద్ షమీని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లుగా ఆట ఆడడమే మా పని. బయట నుంచి వచ్చే మాటలు పట్టించుకోం. మా దృష్టి పూర్తిగా మ్యాచ్‌పైనే ఉంది తప్ప ఇలాంటి డ్రామాపై కాదని కోహ్లీ తెలిపాడు.
సోషల్ మీడియాలో కొందరు తమ గుర్తింపును దాచిపెట్టి ఇలాంటి పనులు చేస్తుంటారని, నేటి కాలంలో ఇలాంటివి సర్వసాధారణంగా మరిపోయాయని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇలాంటి వాతావరణం వల్ల డ్రెస్సింగ్ రూమ్ దెబ్బతినకూడదు. బయట ఎలాంటి డ్రామాలు నడిచినా పట్టించుకోం. తరువాత మ్యాచ్‌పైనే మా ఫోకస్ ఉంటుందని తెలిపాడు.
షమీకి పూర్తి మద్దతు
మతం ఆధారంగా ఏ వ్యక్తిని టార్గెట్ చేయరాదని విరాట్ కోహ్లీ స్పష్టంగా తెలిపాడు. అలా చేయడం తప్పు. నేనెప్పుడూ ఎవరితోనూ ఇలా ప్రవర్తించలేదు. అయితే ఇది కొందరి మూర్ఖుల పని. మహ్మద్ షమీ టీమ్ ఇండియాలో ముఖ్యమైన భాగం. భారత్ తరఫున ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. ఇప్పటికీ, అతని ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ట్రోల్స్ చేసే వారి కోసం మా సమయాన్ని వృధా చేసుకోవాలని కూడా అనుకోను. షమీకి మద్దతుగా 200 శాతం నిలబడతాం. బయటి వ్యక్తుల ప్రవర్తన మన సంబంధాలను ప్రభావితం చేయదంటూ హెచ్చరించాడు.
పాండ్యా ఫిట్‌గా ఉన్నాడు..
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి మాట్లాడాడు. హార్దిక్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, ఆరో బౌలర్ అవసరమైతే సిద్ధంగా ఉంటాడని విరాట్ పేర్కొన్నాడు. జట్టులో శార్దూల్ ఠాకూర్ స్థానం గురించి విరాట్‌ను ప్రశ్నించగా, అతను మా ప్లానింగ్‌లో భాగమని చెప్పాడు. వారికి సామర్థ్యాలు ఉన్నాయని తెలిపాడు. అయితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాలా లేదా అనేది విరాట్ స్పష్టం చేయలేదు.
Also Read: T20 World Cup 2021: క్రికెట్ అభిమానులను క్షమాపణ కోరిన ఐసీసీ.. ఎందుకంటే..
SA vs SL Live Score, T20 World Cup 2021: తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. 7 ఓవర్లకు 44/1