IND vs NZ: నాకౌట్‌లో దుమ్మురేపిన భారత్.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు..

India vs New Zealand, 1st Semi-Final: అంతకుముందు, 2015 ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ చేసిన 302 పరుగులే.. ప్రపంచకప్ నాకౌట్‌లలో అత్యధిక స్కోరుగా నిలిచింది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ తన అత్యుత్తమ స్కోరును కూడా అధిగమించింది. ధర్మశాలలో జరిగిన ఈ ఎడిషన్‌లో టీమిండియా గత అత్యుత్తమ స్కోర్ 274లు మాత్రమే.

IND vs NZ: నాకౌట్‌లో దుమ్మురేపిన భారత్.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు..
Team India Cwc 2023

Updated on: Nov 15, 2023 | 5:41 PM

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతోంది. ఈ క్రమంలో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా ఆడడంతో.. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ నాకౌట్ స్కోరును భారత్ అధిగమించడం విశేషం.

అంతకుముందు, 2015 ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ చేసిన 302 పరుగులే.. ప్రపంచకప్ నాకౌట్‌లలో అత్యధిక స్కోరుగా నిలిచింది.

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ తన అత్యుత్తమ స్కోరును కూడా అధిగమించింది. ధర్మశాలలో జరిగిన ఈ ఎడిషన్‌లో టీమిండియా గత అత్యుత్తమ స్కోర్ 274లు మాత్రమే.

ఇరుజట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..