ముంబై టెస్టులో రెండో రోజు తొలి సెషన్ ఆట ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కంటే 40 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ తరఫున గిల్ 70 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. 60 పరుగుల వద్ద అవుట్ కావడంతో టీమిండియాఐదో వికెట్ కోల్పోయింది. పంత్, గిల్ కలిసి ఐదో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓవర్ నైట్ స్కోరు 86/4 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ కు గిల్, పంత్ భారీ భాగస్వామ్యం అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పంత్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్లతో న్యూజిలాండ్ బౌలర్ల లయను దెబ్బ తీశాడు. రిషభ్ పంత్ (60: 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) వన్డే మాదిరిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. అదే క్రమంలో గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 94 పరుగులు జోడించారు.
అయితే వీరిద్దరికి స్వల్ప వ్యవధిలో లైఫ్‌లు దొరికాయి. న్యూజిలాండ్ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లను నేలపాలు చేశారు. దీంతో వాటిని సద్వినియోగం చేసుకున్న పంత్ – గిల్ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. అయితే, ఇన్నింగ్స్‌లో 38వ ఓవర్ వేసిన స్పిన్నర్ సోధి బంతిని అంచనా వేయడంలో పంత్ తడబడ్డాడు. అంపైర్ ఎల్బీ ఇవ్వడంతో డీఆర్ఎస్ తీసుకున్నా సానుకూల ఫలితం రాలేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్ అయింది.
It’s Lunch on Day 2 of the Mumbai Test! #TeamIndia added 1⃣0⃣9⃣ runs to their overnight score to move to 195/5.
7⃣0⃣* for Shubman Gill
6⃣0⃣ for Rishabh PantWe shall be back for the Second Session shortly! ⌛️
Scorecard ▶️ https://t.co/KNIvTEy04z#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/uyJeIkxsAr
— BCCI (@BCCI) November 2, 2024
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
టామ్ లాథమ్ (కెప్టెన్), డ్వేన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..