IND vs NZ, 3rd T20I: 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

Abhishek Sharma hits fifty in 14 balls: గువహటి వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.

IND vs NZ, 3rd T20I: 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
Ind Vs Nz 3rd T20i Abhishek Sharma Fifty

Updated on: Jan 25, 2026 | 9:32 PM

Abhishek Sharma hits fifty in 14 balls: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక భారతీయ బ్యాటర్ సాధించిన రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా ఇది రికార్డుల్లోకెక్కింది.

యువరాజ్ సింగ్ రికార్డు.. ఈ జాబితాలో టీమ్ ఇండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువీ కేవలం 12 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లోనే స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడంతో, యువరాజ్ తర్వాత అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.