క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో వన్డే నేడు(నవంబర్ 30)న జరుగుతోంది. 3 వన్డేల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అయినా సిరీస్‌ను డ్రాగా ముగించాలనే ఉద్దేశంతో టీమ్ ఇండియా మైదానంలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపకపోతేనే ఫలితం వెలువడుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ జట్టు ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. అనంతరం ఇరుజట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్లను ప్రకటించాయి. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే శిఖర్ ధావన్ మ్యాచ్‌కు వెళ్తున్నాడు. అయితే న్యూజిలాండ్ టీమ్ మాత్రం చిన్న మార్పుతో ఫీల్డింగ్‌కు దిగింది. న్యూజిలాండ్ ఆటగాడు బ్రెస్‌వెల్‌కు బదులుగా ఆడమ్ మిల్నేని జట్టులోకి తీసుకుంటున్నట్లుగా కేన్ ప్రకటించాడు.
? Toss Update ?
ఇవి కూడా చదవండిNew Zealand have elected to bowl against #TeamIndia in the third #NZvIND ODI.
Follow the match ? https://t.co/NGs0HnQVMX pic.twitter.com/jgNd3L60cC
— BCCI (@BCCI) November 30, 2022
భారత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు జట్టు సారథి శిఖర్ ధావన్, శుభమాన్ గిల్ రంగంలోకి దిగారు. అయితే ఈ వన్డే సిరీస్ విశేషమేమంటే.. మూడు మ్యాచ్‌లలోనూ భారత్ టాస్ ఓడింది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో ఓడిన ధావన్ సేనకు రెండో వన్డేలో వర్షం కారణంగా ఎదురుదెబ్బ తగిలింది. అయితే క్రైస్ట్‌చర్చ్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో టీమ్‌ఇండియా ఒక్కటి మాత్రమే గెలిచింది. అలాగే కివీస్‌తో ఆడిన గత 5 వన్డేల్లో 4 ఓడిపోయింది టీమిండియా. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ను కాపాడుకోవాలంటే కనీసం సమం చేసుకోవడమే భారత్‌కు ఉన్న అవకాశం. ఇందుకోసం ఈ రోజు జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాఅయినా గెలవాలి.
? Team News#TeamIndia remain unchanged. #NZvIND
Follow the match ? https://t.co/NGs0HnQVMX
A look at our Playing XI ? pic.twitter.com/GtVFwgYHqR
— BCCI (@BCCI) November 30, 2022
జట్ల వివరాలు..
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్.
న్యూజిలాండ్ జట్టు : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..