IND vs NZ: నిలవాలంటే తప్పక గెలవాల్సిందే.. లక్నోలో టీమిండియా రికార్డులు ఇవే.. టాస్‌దే కీలక పాత్ర..

IND vs NZ 2nd T20I: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీT20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ జనవరి 29 సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది.

IND vs NZ: నిలవాలంటే తప్పక గెలవాల్సిందే.. లక్నోలో టీమిండియా రికార్డులు ఇవే.. టాస్‌దే కీలక పాత్ర..
Ind Vs Nz 2nd T20i

Updated on: Jan 29, 2023 | 7:12 AM

India vs New Zealand 2nd T20I Preview: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టీమిండియాకు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్. నిజానికి ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత జట్టు 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ను కాపాడుకోవాలంటే లక్నో వేదికగా జరిగే టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తప్పక గెలవాల్సిందే.

లక్నో పిచ్ ఎలా ఉంది?

లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ ప్రతిసారీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుస్తుంది. ఈ విజయాలన్నీ కొంత ఏకపక్షంగానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ వికెట్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు మరింత సహాయం అందుతున్నట్లు స్పష్టమైంది. అయితే రాత్రిపూట రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.

లక్నో వాతావరణం ఎలా ఉంది?

లక్నోలో జరిగే మ్యాచ్‌లో ఉష్ణోగ్రత 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. మ్యాచ్ జరిగే రోజు వర్షం కురిసే అవకాశం లేదు. అంటే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి

లక్నోలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?

భారత జట్టు లక్నోలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. రెండు సార్లు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 190+ పరుగులు చేసింది. భారత్ ఇక్కడ శ్రీలంక, వెస్టిండీస్‌లను ఓడించింది.

టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ముందంజ..

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ రాంచీలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డెవాన్ కాన్వే (52), డారిల్ మిచెల్ (59) అర్ధ సెంచరీలతో 176 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్‌కు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ సిరీస్‌లో కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..