AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడం కరెక్టే.. గంభీర్ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీకి తొలి టీ20 లో అవకాశం ఇవ్వక పోవడాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సమర్థించారు. గౌతమ్ గంభీర్ నిర్ణయం సరైందేనని, విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకుండా అనుభవజ్ఞు లకే ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం అని పేర్కొన్నారు.

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడం కరెక్టే.. గంభీర్ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 27, 2026 | 11:19 AM

Share

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ పూర్తిగా సమర్థించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు లేదా బయటి శబ్దాలు కేవలం బయటనే ఉండిపోవాలని, డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం ప్రశాంతత, ప్రతిభ ఆధారంగానే నిర్ణయాలు జరగాలని ఆయన X వేదికగా స్పష్టం చేశారు.

భారత జట్టు ప్రస్తుతం సీనియర్, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగిందని మంజ్రేకర్ గుర్తు చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడం కోసం, నిలకడగా రాణిస్తున్న విన్నింగ్ కాంబినేషన్‌ను చెడగొట్టడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అనుభవానికే జట్టు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చారు.

టాస్ సమయంలో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో లేకపోవడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా క్లారిటీ ఇచ్చారు. వైభవ్ జట్టులోకి రాకపోవడం దురదృష్టకరమే అయినప్పటికీ, సరైన సమయం వచ్చినప్పుడు అతనికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని అయ్యర్ నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుత పిచ్ పరిస్థితులు, వ్యూహాల ప్రకారం తాము ముగ్గురు జెన్యూన్ ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగాల్సి వచ్చిందని, అందుకే సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చిందని కెప్టెన్ స్పష్టం చేశారు.

భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ సైతం మ్యాచ్‌కు ముందే వైభవ్ ఎంట్రీపై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ అసాధారణమైన ప్రతిభావంతుడనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. ఐపీఎల్‌లో జోఫ్రా ఆర్చర్ లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని అతను తన సత్తా చాటాడని కొనియాడారు. అయితే, కేవలం ఒకరికి అవకాశం ఇవ్వడం కోసం ఇప్పటికే పరుగులు చేస్తున్న మరో ఆటగాడిని డ్రాప్ చేయడం ఆ ఆటగాడికి చేసే అన్యాయమే అవుతుందని కోటక్ పేర్కొన్నారు. ప్రయోగాల పేరిట ఎవరికీ అన్యాయం చేయలేమని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us