
Rohit Sharma: బుధవారం న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో రోహిత్ శర్మ T20Iలలో 4,000 పరుగులు దాటాడు. భారత కెప్టెన్ తన 144వ ఇన్నింగ్స్‌లో ఈ మార్కును పూర్తి చేశాడు. విరాట్ కోహ్లి తర్వాత ఈ ఫీట్‌ను చేరుకున్న రెండవ బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాకుండా.. 4000 పరుగుల అడ్డంకిని దాటిన ఏకైక బ్యాటర్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచాడు. రోహిత్ కెరీర్‌లో ఐదు సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే, అజేయంగా 121 పరుగులతో కెరీర్‌లో బెస్ట్ స్కోర్ కలిగి ఉన్నాడు.
తక్కువ బంతుల్లో 4 వేల టీ20 పరుగులు.. కోహ్లీ రికార్డు బ్రేక్..
అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో 4 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అతను 2860 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ 2900 బంతుల్లో 4 వేల పరుగులు సాధించాడు.
T-20 ప్రపంచకప్ లో 600 అంతర్జాతీయ సిక్సర్లు, 1000 పరుగులు..
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 600 సిక్సర్లు కొట్టాడు. అతను 9వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న జాషువా లిటిల్ రెండు వరుస బంతుల్లో సిక్సర్లు కొట్టాడు. అంతే కాదు, రెండో సిక్స్‌తో రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో 1000 పరుగులు కూడా పూర్తి చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ 10వ అర్ధశతకం..
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్ అడైర్ వేసిన 10వ ఓవర్ 5వ బంతికి ఫోర్ కొట్టి తన అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌కి ఇది 10వ అర్ధశతకం. యాభై పరుగులు చేసి రిటైరయ్యాడు.
🚨 Milestone Alert 🚨
4⃣0⃣0⃣0⃣ T20I runs & going strong! 💪 💪
Congratulations, Rohit Sharma! 👏 👏
Follow The Match ▶️ https://t.co/YQYAYunZ1q#T20WorldCup | #TeamIndia | #INDvIRE | @ImRo45 pic.twitter.com/ffXgP5GCQg
— BCCI (@BCCI) June 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..