IND vs ENG: నీ దూకుడు సాటెవ్వడూ.. కేన్‌ మామనే అధిగమించిన యశస్వి జైస్వాల్‌..

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్.. మొత్తంగా 133 బంతులు ఎదుర్కుని 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు

IND vs ENG: నీ దూకుడు సాటెవ్వడూ.. కేన్‌ మామనే అధిగమించిన యశస్వి జైస్వాల్‌..
Yashasvi Jaiswal, Kane Williamson

Updated on: Feb 18, 2024 | 8:19 AM

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్.. మొత్తంగా 133 బంతులు ఎదుర్కుని 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. కాగా ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోన్న యశస్వి ఇప్పుడు ఒక విషయంలో న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ అండ్‌ కెప్టెన్‌ కేన్‌ మామనే వెనక్కు నెట్టాడు. 2024లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అధిగమించాడీ యంగ్ సెన్సేషన్‌. ఇంగ్లండ్‌పై మూడో టెస్టు సెంచరీ చేసిన జైస్వాల్ 122 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో జైస్వాల్ 2024లో 463 పరుగులు చేశాడు. తద్వారా 2024లో 403 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అధిగమించాడు జైస్వాల్‌. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న కేన్ గత 7 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు చేశాడు.

వీరిద్దరూ కాకుండా మూడో స్థానంలో ఉన్న రచిన్ రవీంద్ర ఈ ఏడాది 301 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో రవీంద్ర భర్జారీ డబుల్ సెంచరీ సాధించాడు. 4వ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో 295 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ భారీ సెంచరీ సాధించాడు. 2023లో వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన జైస్వాల్ ఇప్పటివరకు భారత్ తరఫున 7 టెస్టు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలతో సహా 751 పరుగులు చేశాడు. 17 టీ20 మ్యాచ్‌లు ఆడి 502 పరుగులు కూడా చేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యస్సవ్ జైస్వాల్ ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. 2022 ఐపీఎల్‌లో 258 పరుగులు కూడా చేశాడు.

ఇవి కూడా చదవండి

బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..

వైజాగ్ లో డబుల్, రాజ్ కోట్ లో సెంచరీ..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి