W, W, W, W, W, W, W.. ఒక్క రోజులో ఇంగ్లాండ్‌ను ‘ఏడు’పించిన భారత బౌలర్లు.. 136 ఏళ్ల రికార్డు రిపీట్

లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా అద్భుతమైన రికార్డు సృష్టించింది. భారత జట్టు ఈ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి. అలాగే టెస్ట్ క్రికెట్‌లో 70 సంవత్సరాల క్రితం జరిగిన సీన్ రిపీట్ అయింది. అదేంటంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

W, W, W, W, W, W, W.. ఒక్క రోజులో ఇంగ్లాండ్‌ను ఏడుపించిన భారత బౌలర్లు.. 136 ఏళ్ల రికార్డు రిపీట్
India Bowlers

Updated on: Jul 14, 2025 | 1:17 PM

సరిగ్గా 70 సంవత్సరాల గ్యాప్ తర్వాత టెస్టు క్రికెట్‌లో సరికొత్త సీన్ పునరావృత్తం అయింది. లార్డ్స్ వేదికగా టీమిండియా బౌలర్లు ఇలా చేయడం ఇదే మొదటిసారి. మరి అదేంటని ఆలోచిస్తున్నారా.? ఒక ఇన్నింగ్స్‌లో మూడు కంటే ఎక్కువ బ్యాటర్లను బౌల్డ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చారు మన ఇండియన్ బౌలర్లు. లార్డ్స్ టెస్టులో టీం ఇండియా బౌలర్లు ఇంగ్లాండ్‌పై 20 వికెట్లు పడగొట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. 12 వికెట్లను క్లీన్ బౌల్డ్‌ రూపంలో వచ్చాయి. భారత బౌలర్లు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటిసారి. 70 సంవత్సరాల సీన్ రిపీట్ అయింది.

టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో చివరిసారిగా 1955లో 12 మంది బ్యాట్స్‌మెన్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. 70 సంవత్సరాల తర్వాత 2025లో ఆ సీన్ రిపీట్ అయింది. లార్డ్స్ టెస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు క్లీన్ బౌల్డ్‌ రూపంలో పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో తన నాలుగు వికెట్లను క్లీన్ బౌల్డ్‌గా.. వీరితో పాటు సిరాజ్, ఆకాష్ దీప్ ఒక్కొక్క వికెట్‌ను క్లీన్ బౌల్డ్ రూపంలో సాధించారు.

136 సంవత్సరాల తర్వాత..

టెస్ట్ క్రికెట్‌లో 136 ఏళ్ల తర్వాత లార్డ్స్ టెస్ట్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో మిడిల్ ఆర్డర్, టెయిలెండర్ క్లీన్ బౌల్డ్ అవ్వడం ఇది రెండోసారి. చివరిసారిగా 1889లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇదే జరిగింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..