AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akash Deep : దమ్ముంటే బాల్ వేయ్.. ఇంగ్లాండ్ ప్లేయర్‎ను ఆట ఆడుకున్న ఆకాష్ దీప్

లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట ముగింపులో ఆకాష్ దీప్, బ్రిడాన్ కార్సే మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం సాధారణం. అయితే, లార్డ్స్ టెస్ట్‌లో భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చింది. చివరి రోజు ఆట మరింత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

Akash Deep : దమ్ముంటే బాల్ వేయ్.. ఇంగ్లాండ్ ప్లేయర్‎ను ఆట ఆడుకున్న ఆకాష్  దీప్
Brydon Carse
Rakesh
|

Updated on: Jul 14, 2025 | 1:23 PM

Share

Akash Deep : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో భారత బౌలర్ ఆకాష్ దీప్, ఇంగ్లాండ్ బౌలర్ బ్రిడాన్ కార్సే మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆకాష్ దీప్ బంతిని ముందుకు ఆపిన తర్వాత, కార్సే విసిరేందుకు ప్రయత్నించగా ఆకాష్ దీప్ నువ్వు బాల్ వేయ్ అన్నట్లు రెచ్చగొట్టాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో జరిగింది. అంతకుముందు కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ వికెట్లు తీసి కార్సే మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పటికే ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో, బెన్ స్టోక్స్ అతని జట్టు కూడా దీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు కనిపించింది.

కార్సే బంతిని ఆకాష్ దీప్ వైపు విసిరేందుకు ప్రయత్నించాడు. దీనిపై ఆకాష్ దీప్ కోపంగా.. దమ్ముంటే బాల్ వేయ్..అంటూ ఇంగ్లాండ్ ఆటగాడిని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, ఆకాష్ దీప్ వికెట్లు కోల్పోయి 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆట చివరి బంతికి బెన్ స్టోక్స్, ఆకాష్ దీప్ వికెట్ తీసి భారత జట్టుకు మరో షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తో కలిసి చివరి రోజు విజయం కోసం పోరాడాలి. మొదటి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ కలిసి 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 192 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా