Ind vs Eng: మరోసారి టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన గంభీర్..

India vs England 5th Test Day 1: ఓవల్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టులో 3 మార్పులు జరిగాయి. గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో పాటు, ప్రసిద్ధ్ కృష్ణను కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు.

Ind vs Eng: మరోసారి టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన గంభీర్..
Ind Vs Eng 5th Test

Updated on: Jul 31, 2025 | 3:24 PM

India vs England 5th Test Day 1: భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా, టీమ్ ఇండియాలో నాలుగు ప్రధాన మార్పులు జరిగాయి. గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. ఇది కాకుండా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆడటం లేదు. కుల్దీప్ యాదవ్‌కు మరోసారి అవకాశం రాలేదు. ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. కరుణ్ నాయర్ కూడా తిరిగి వచ్చాడు.

కరుణ్ నాయర్ తిరిగి వచ్చాడు..

ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ తిరిగి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. దీంతో పాటు, గాయం తర్వాత ఆకాష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అన్షుల్ కాంబోజ్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం లభించింది. సాయి సుదర్శన్‌కు మళ్ళీ అవకాశం లభించింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో అతను తనను తాను నిరూపించుకోవాలి. కరుణ్ నాయర్ బాగా రాణించాలని ఒత్తిడి కూడా ఉంది.

ఇది టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్..

శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..