IND vs ENG: సిరీస్ గెలిచాక రవిశాస్త్రికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన పంత్‌.. వైరలవుతోన్న టీమిండియా సెలబ్రేషన్స్‌..

India vs England: ఇంగ్లాండ్‌తో మాంచెష్టర్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రిషభ్‌ పంత్‌ సూపర్‌ సెంచరీ (125)తో చెలరేగగా.. హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టాడు. కాగా ఈ సిరీస్‌కు ముందు  టీ20 సిరీస్‌లో కూడా టీమిండియా

IND vs ENG: సిరీస్ గెలిచాక రవిశాస్త్రికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన పంత్‌.. వైరలవుతోన్న టీమిండియా సెలబ్రేషన్స్‌..
Team India

Updated on: Jul 18, 2022 | 12:14 PM

India vs England: ఇంగ్లాండ్‌తో మాంచెష్టర్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రిషభ్‌ పంత్‌ సూపర్‌ సెంచరీ (125)తో చెలరేగగా.. హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టాడు. కాగా ఈ సిరీస్‌కు ముందు  టీ20 సిరీస్‌లో కూడా టీమిండియా జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సిరీస్‌ గెలిచాక ట్రోఫీ తీసుకునే సమయంలో భారత జట్టు ఆటగాళ్లు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు షాంపైన్‌ బాటిల్స్ స్ప్రే చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కాగా జట్టు ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చే ముందు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సెంచరీతో టీమిండియాను గెలిపించిన పంత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారంతో పాటు ఓ షాంపెన్‌ బాటిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే పంత్‌ దీనిని నేరుగా మాజీ కోచ్‌ రవిశాస్త్రికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే ట్రోఫీ అందుకున్న తర్వాత శిఖర్‌ ధావన్ షాంపైన్ బాటిల్‌ తెరిచి కెప్టెన్‌ రోహిత్‌పై స్ర్పే చేశాడు. దీంతో మిగిలిన ఆటగాళ్లు ధావన్‌కు దూరంగా పరిగెత్తారు. రోహిత్ కూడా ధావన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు.గ్రూప్‌ ఫొటో దిగుదాం రండి అని కెప్టెన్‌ రోహిత్‌ మిగిలిన ఆటగాళ్లను కోరాడు. కానీ పంత్‌ అస్సలు తగ్గలేదు.. మళ్లీ షాంపైన్‌ బాటిల్‌ తీసుకొచ్చి హిట్‌మ్యాన్‌పై చల్లాడు. చివరకు అంతా కలిసి విన్నింగ్‌ ట్రోఫిని యంగ్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు అందించాడు. ఇంతలో కింగ్‌ కోహ్లీ మళ్లీ స్టార్ట్‌ చేశాడు. పెద్ద షాంపెన్‌ బాటిల్‌ను తెరచి జట్టు సభ్యులందరిపై స్ప్రే చేశాడు. దీంతో ఆటగాళ్లు పోడియం విడిచి గ్రౌండ్‌లోకి పరిగెత్తారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..