Rishabh Pant: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రికార్డుల మోత మోగించిన రిషబ్‌ పంత్‌.. దిగ్గజాలను సైతం వెనక్కునెట్టి..

| Edited By: Ravi Kiran

Jul 02, 2022 | 7:00 AM

India vs England: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్‌ టెస్ట్‌ మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అద్భుత సెంచరీ సాధించాడు. కేవలం111 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేసి ..

Rishabh Pant: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రికార్డుల మోత మోగించిన రిషబ్‌ పంత్‌.. దిగ్గజాలను సైతం వెనక్కునెట్టి..
Rishabh Pant
Follow us on

India vs England: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్‌ టెస్ట్‌ మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అద్భుత సెంచరీ సాధించాడు . కేవలం111 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేసి భారతజట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈక్రమంలోనే వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో రిషబ్ పంత్‌కి ఇది ఐదో శతకంకాగా.. ఆసియా వెలుపల నాలుగు శతకాలు బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు టెస్టు సెంచరీలు నమోదు చేసిన కీపర్‌గానూ పంత్‌ ఘనత సాధించాడు. ఇక ఆసియా వెలుపల అత్యంత వేగంగా టెస్టు సెంచరీ నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌లో రెండు టెస్టు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ కూడా పంత్. ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో కూడా రిషభ్‌ సెంచరీలు సాధించాడు. ఇదే క్రమంలో అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో 2వేల పరుగుల మార్కును కూడా అధిగమించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 77 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. జడేజా (83), షమీ (0) క్రీజులో ఉన్నారు. గిల్‌ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయస్‌ (15) పూర్తిగా నిరాశపర్చారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ (52/3), మాథ్యూ ప్యాట్స్‌ (85/2) సత్తాచాటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..