IND vs ENG: ప్లీజ్.. ఏకైక టెస్టుకు సారథిగా ఆయనే బెస్ట్.. బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తోన్న నెటిజన్లు.. ఎవరంటే?

|

Jun 26, 2022 | 4:07 PM

గతేడాది జరిగిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో తొలి నాలుగు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ గైర్హాజరీతో మరోసారి విరాట్‌కు జట్టు కమాండ్‌ని ఇవ్వాలనే డిమాండ్‌ వచ్చింది.

IND vs ENG: ప్లీజ్.. ఏకైక టెస్టుకు సారథిగా ఆయనే బెస్ట్.. బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తోన్న నెటిజన్లు.. ఎవరంటే?
Ind Vs Eng Virat Kohli
Follow us on

ఇంగ్లండ్‌(IND vs ENG)తో జరిగే ఏకైక లేదా ఐదవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు భారత క్రికెట్ జట్టు(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కరోనా బారిన పడ్డాడు. గత ఏడాది జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో, ‘హిట్‌మ్యాన్’ భారతదేశం తరపున అత్యధిక పరుగులు సాధించి, అగ్రస్థానంలో నిలిచాడు. అయితే టీమ్ ఇండియాలోని చాలా మంది ఆటగాళ్లకు కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా, ఐదవ అంటే చివరి టెస్ట్ మ్యాచ్ నిర్వహించలేకపోయింది. దీంతో ఈ మ్యాచ్‌ను జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడగలడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతను ఇప్పటికీ 5వ టెస్ట్ ఆడగలడు. కానీ, అతని కరోనా నివేదిక ప్రతికూలంగా మారితే మాత్రమే ఆడే చాన్స్ ఉంది. అయితే అతని రిపోర్ట్ ఆశించిన స్థాయిలో రాకపోతే, రోహిత్ శర్మ 5వ టెస్టు మ్యాచ్ ఆడకపోతే? ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

గతేడాది జరిగిన ఈ సిరీస్‌లో తొలి నాలుగు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ గైర్హాజరీతో మరోసారి విరాట్‌కు జట్టు కమాండ్‌ని ఇవ్వాలనే డిమాండ్‌ వచ్చింది. సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్‌లు ఇస్తూ, ఒకే ఒక్క టెస్టులో కోహ్లీని కెప్టెన్‌గా చేయాలంటూ వేడుకుంటున్నారు. ‘దయచేసి విరాట్‌ను కెప్టెన్‌గా చేయండి’ అని బీసీసీఐని కోరుతూ, నెట్టింట్లో తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ సిరీస్‌లో టీమిండియాను గెలిపించే సత్తా విరాట్‌కు ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోకపోతే, అతను లేనప్పుడు జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా కమాండ్‌ని చేపట్టగలడనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే 35 ఏళ్ల తర్వాత టెస్టుల్లో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఓ ఫాస్ట్ బౌలర్ కనిపించడం ఇదే తొలిసారి కానుంది.