IND vs ENG: సత్తా చాటిన బుమ్రా.. అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో బుల్లెట్‌లా దూసుకొచ్చిన యార్కర్ కింగ్..

Jasprit Bumrah: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో యూన్సెన్ ఐదో స్థానంలో ఉన్నాడు. మార్కో యూన్సెన్ 6 మ్యాచ్‌ల్లో 22.31 సగటుతో 13 వికెట్లు తీశాడు. దీని తర్వాత గెరాల్డ్ కోట్జే ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ దక్షిణాఫ్రికా బౌలర్ 5 మ్యాచ్‌ల్లో 22 సగటుతో 12 వికెట్లు తీశాడు. అదే సమయంలో, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ ఏడో స్థానంలో ఉన్నాడు.

IND vs ENG: సత్తా చాటిన బుమ్రా.. అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో బుల్లెట్‌లా దూసుకొచ్చిన యార్కర్ కింగ్..
Jasprit Bumrah

Updated on: Oct 29, 2023 | 10:16 PM

Most Wickets In World Cup 2023: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా 29వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లలో రోహిత్ సేన 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ముందు టీమిండియా 230 పరుగుల లక్ష్యం ఉంచింది. అయితే, జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ షమీ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశారు. కాగా స్పిన్ జోడీ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు. అదే సమయంలో జో రూట్‌ను ఔట్ చేయడంతో జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు..

గతంలో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు జస్‌ప్రీత్‌ బుమ్రా అతడిని వదిలిపెట్టాడు. అయితే షాహీన్ ఆఫ్రిది 13 వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లతో మూడవ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా నంబర్ వన్‌లో ఉన్నాడు. ఆడమ్ జంపా 6 మ్యాచ్‌ల్లో 19.06 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ రెండో స్థానంలో నిలిచాడు. మిచెల్ సాంట్నర్ 6 మ్యాచ్‌ల్లో 20.21 సగటుతో 16 మంది ఆటగాళ్లను అవుట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్‌లో ఈ బౌలర్లు అద్భుతంగా..

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో యూన్సెన్ ఐదో స్థానంలో ఉన్నాడు. మార్కో యూన్సెన్ 6 మ్యాచ్‌ల్లో 22.31 సగటుతో 13 వికెట్లు తీశాడు. దీని తర్వాత గెరాల్డ్ కోట్జే ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ దక్షిణాఫ్రికా బౌలర్ 5 మ్యాచ్‌ల్లో 22 సగటుతో 12 వికెట్లు తీశాడు. అదే సమయంలో, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ ఏడో స్థానంలో ఉన్నాడు. ఈ బౌలర్ 6 మ్యాచ్‌ల్లో 25.82 సగటుతో 11 మంది ఆటగాళ్లను అవుట్ చేశాడు. శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంక ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. దిల్షాన్ మధుశంక 5 మ్యాచ్‌ల్లో 24.55 సగటుతో 11 వికెట్లు తీశాడు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..