IND vs ENG: ‘రూట్‌’ దొరుకుతుందా? పట్టు సాధించాలంటే తోక కట్‌ చేయాల్సిందే.. రెండో రోజు రోహిత్ ప్లాన్ ఇదే

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు హోరాహొరీగా సాగింది. రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ ఆరంభంలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ఇంగ్లండ్ టాపార్డర్‌ ను కుప్పుకూల్చారు. అయితే సీనియర్ బ్యాటర్ జో రూట్‌ ఇంగ్లండ్ జట్టుకు ఆపద్బాందవుడిలా మారాడు.

IND vs ENG: రూట్‌ దొరుకుతుందా? పట్టు సాధించాలంటే తోక కట్‌ చేయాల్సిందే.. రెండో రోజు రోహిత్ ప్లాన్ ఇదే
India Vs England

Updated on: Feb 24, 2024 | 9:09 AM

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు హోరాహొరీగా సాగింది. రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ ఆరంభంలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ఇంగ్లండ్ టాపార్డర్‌ ను కుప్పుకూల్చారు. అయితే సీనియర్ బ్యాటర్ జో రూట్‌ ఇంగ్లండ్ జట్టుకు ఆపద్బాందవుడిలా మారాడు. అజేయ సెంచరీతో ఇంగ్లండ్ ను మ్యాచ్‌ లో నిలిపాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లిష్‌ 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. జో రూట్ కు తోడుగా ఓలీ రాబిన్ సన్ క్రీజులో ఉన్నాడు. ఇతను టెయిలెండర్ అయినప్పటికీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో సెంచరీలు చేసిన అనుభవం ఉంది. కాబట్టి రాంచీ టెస్టులో రోహిత్ సేన పట్టు బిగించాలంటే రూట్ తో పాటు రాబిన్ సన్ లను త్వరగా పెవిలియన్ పంపించాల్సి ఉంది. అలాగే వీలైనంత తక్కువ స్కోరును ఇంగ్లండ్ ను ఆలౌట్‌ చేయాలి. అప్పుడే రాంచీ టెస్టుపై భారత్ కు పట్టు లభిస్తుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ శుభారంభం లభించలేదు. కొత్త బౌలర్‌ ఆకాష్ దీప్ స్టోక్స్ సేనకు వరుసగా షాక్‌ లు ఇచ్చాడు. మొదట అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బెన్ డకెట్ 11 పరుగుల వద్ద వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఆకాష్ బౌలింగ్‌లో ఓలీ పోప్ ఎల్బీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. వేగంగా పరుగులు చేస్తోన్న జాక్ క్రాలే (42) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జో రూట్, జానీ బెయిర్‌స్టో జాగ్రత్తగా ఆడారు. 38 పరుగుల వద్ద ఉన్న బెయిర్‌స్టో రవిచంద్రన్ అశ్విన్ స్పిన్‌కు చిక్కాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా 3 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఎండ్‌ లో జో రూట్‌ నిలకడగా బ్యాటింగ్‌ చచేశాడు. అతనికి వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ బెన్ ఫోక్స్ చక్కటి సహకారం అందించాడు. 47 పరుగుల వద్ద ఫోక్స్ అవుటైనప్పటికీ రాబిన్ సన్ సహకారంతో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ ఒలి రాబిన్సన్ కూడా 31 పరుగులతో క్రీజులో నాటౌట్‌గా కొనసాగుతున్నాడు. జట్టు తరఫున ఒంటరి పోరాటం చేసిన రూట్ 226 బంతుల్లో 9 బౌండరీల సాయంతో 106 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరఫున ఆకాశ్ దీప్ 3, మహ్మద్ సిరాజ్ 2, అశ్విన్-జడేజా 1 వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.