Video: విరిగిన కాలు.. భరించలేని నొప్పి.. కట్‌చేస్తే.. హాఫ్ సెంచరీతో తొడ కొట్టిన పంత్..

Rishabh Pant Half Century: టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున రిషబ్ పంత్ కాలికి గాయం కావడంతో పాటు రిటైర్డ్ హర్ట్ తో మైదానం నుంచి వెళ్లిపోయాడు. అయినప్పటికీ, అతను రెండవ రోజు మైదానంలోకి తిరిగి రావడమే కాకుండా, బ్యాటింగ్‌కు వచ్చి, హాఫ్ సెంచరీ సాధించాడు.

Video: విరిగిన కాలు.. భరించలేని నొప్పి.. కట్‌చేస్తే.. హాఫ్ సెంచరీతో తొడ కొట్టిన పంత్..
Rishabh Pant

Updated on: Jul 24, 2025 | 7:03 PM

Rishabh Pant Broken Foot: దేశం తరపున ఆడటం ఏ ఆటగాడికైనా అతిపెద్ద గౌరవం. ప్రతి ఆటగాడు ఈ గౌరవాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. అందుకే చాలాసార్లు ఆటగాళ్ళు తమ గాయాలను పట్టించుకోకుండా జట్టు కోసం బాధను మరచిపోతుంటారు. తాజాగా టీం ఇండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ దీనికి తాజా ఉదాహరణను అందించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్ట్‌లో రెండవ రోజు తన కాలులో ఫ్రాక్చర్ ఉన్నప్పటికీ, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. రిటైర్డ్ హర్ట్ తర్వాత తిరిగి బ్యాటింగ్ వచ్చే క్రమంలో పంత్‌కు సెల్యూట్ చేశారు. ఈ క్రమంలో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం నిరాశ పరచకుండా తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి పెవిలియన్ చేరాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

భారత్ 358 పరుగులకు ఆలౌట్..

మాంచెస్టర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 358 పరుగులకు ఆలౌట్ అయింది. గురువారం మ్యాచ్ రెండో రోజు 264/4 స్కోరుతో ఆట ప్రారంభించిన భారత జట్టు బ్యాటింగ్‌కు కష్టతరమైన పరిస్థితుల్లో 94 పరుగులు చేయడంలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో గాయపడినప్పటికీ భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగాడు. ఇది మాత్రమే కాదు, అతను తన అర్ధ సెంచరీని కూడా పూర్తి చేశాడు. అతను తన ఇన్నింగ్స్‌ను 37 పరుగులకు పొడిగించాడు. పంత్ కాకుండా, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు, రవీంద్ర జడేజా 20 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

బెన్ స్టోక్స్ 8 సంవత్సరాల తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

రెండు జట్లు..

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్.

ఇంగ్లాండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, లియామ్ డాసన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..