Video: లైవ్ మ్యాచ్‌లో ఇంత పెద్ద మోసమా.. టీమిండియాను ఓడించేందుకు ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడుగా

Brydon Carse Caught Ball Tampering Against India: ఐదవ రోజు ఆటలో, ఇంగ్లాండ్ పేసర్ బ్రైడాన్ కార్స్ తన బూట్లతో బంతిని తొక్కడం ద్వారా బంతిని ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. కార్స్ తన స్పైక్డ్ బూట్లతో బంతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.

Video: లైవ్ మ్యాచ్‌లో ఇంత పెద్ద మోసమా.. టీమిండియాను ఓడించేందుకు ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడుగా
Brydon Carse Caught Ball Ta

Updated on: Jul 28, 2025 | 5:00 PM

Brydon Carse Caught Ball Tampering Against India: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ఆధిక్యం సాధించినప్పటికీ, ఇంగ్లాండ్ మ్యాచ్‌ను గెలవలేకపోయింది. ముఖ్యంగా కీలకమైన ఐదవ రోజు, ఇంగ్లాండ్ గెలవడానికి 8 వికెట్లు అవసరం. కానీ, టీమ్ ఇండియా తరపున, కేఎల్ రాహుల్ (90), శుభ్‌మాన్ గిల్ (102) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా కూడా క్రీజులో నిలబడ్డారు. ఇంతలో, వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్, మ్యాచ్ మధ్యలో మోసానికి పాల్పడింది.

ఐదవ రోజు ఆటలో, ఇంగ్లాండ్ పేసర్ బ్రైడాన్ కార్స్ తన బూట్లతో బంతిని తొక్కడం ద్వారా బంతిని ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. కార్స్ తన స్పైక్డ్ బూట్లతో బంతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఇంగ్లాండ్ బంతిని ట్యాంపరింగ్ చేయడం ద్వారా మ్యాచ్ గెలించేందుకు ప్రయత్నించింది.

ఇవి కూడా చదవండి

ఇంగ్లీషోళ్లు ఎంతటి మోసానికి పాల్పడినా రవీంద్ర జడేజా ( 107), వాషింగ్టన్ సుందర్ (101) క్రీజులో తమను తాము నిలబెట్టుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి