AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 3rd Test: టీమిండియాలో 8 మంది ఓవైపు.. ఇంగ్లండ్‌లో ఆ ఒక్కడే మరోవైపు.. ఏ విషయంలోనో తెలుసా?

IND vs ENG 3rd Test: భారత జట్టు తరపున రోహిత్ శర్మ 56 టెస్టులు, యశస్వి జైస్వాల్ 6 టెస్టులు, శుభ్‌మన్ గిల్ 22 టెస్టులు, రజత్ పాటిదార్ 1 టెస్టు, కేఎస్ భరత్ 7 టెస్టులు ఆడారు. సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పెద్దికల్, ధ్రువ్ జురెల్, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ 8 మంది బ్యాట్స్‌మెన్‌లు కలిసి ఇప్పటివరకు 92 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. మరోవైపు, ఇంగ్లండ్ సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ 137 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ విధంగా చూస్తే, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ భారత్‌లోని 8 మంది బ్యాట్స్‌మెన్‌ల కంటే మెరుగ్గా ఉన్నాడు.

IND vs ENG 3rd Test: టీమిండియాలో 8 మంది ఓవైపు.. ఇంగ్లండ్‌లో ఆ ఒక్కడే మరోవైపు.. ఏ విషయంలోనో తెలుసా?
India Vs England
Venkata Chari
|

Updated on: Feb 13, 2024 | 8:44 PM

Share

India vs England 3rd Test Match: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు ముగియగా, ప్రస్తుతం సిరీస్ 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత పుంజుకున్న టీమిండియా రెండో మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. కానీ, ఇంగ్లండ్ జట్టులోని ఒక బ్యాట్స్‌మెన్‌కు 8 మంది భారత బ్యాట్స్‌మెన్స్ కంటే ఎక్కువ అనుభవం ఉందనే విషయం మీకు తెలుసా? ఆ సీనియర్ ప్లేయర్ ఎవరో మీకు తెలుసా?

ఈ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ముందున్నాడు..

భారత జట్టు తరపున రోహిత్ శర్మ 56 టెస్టులు, యశస్వి జైస్వాల్ 6 టెస్టులు, శుభ్‌మన్ గిల్ 22 టెస్టులు, రజత్ పాటిదార్ 1 టెస్టు, కేఎస్ భరత్ 7 టెస్టులు ఆడారు. సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పెద్దికల్, ధ్రువ్ జురెల్, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ 8 మంది బ్యాట్స్‌మెన్‌లు కలిసి ఇప్పటివరకు 92 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. మరోవైపు, ఇంగ్లండ్ సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ 137 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ విధంగా చూస్తే, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ భారత్‌లోని 8 మంది బ్యాట్స్‌మెన్‌ల కంటే మెరుగ్గా ఉన్నాడు. రూట్ 8 మంది భారత బ్యాట్స్‌మెన్ కంటే ఎక్కువగా 45 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

కేఎల్ రాహుల్ ఔట్..

టెస్టు మ్యాచ్ ప్రారంభం కాకముందే టీమిండియాకు పెద్ద దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ గాయపడి మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సెలక్టర్లు ఎంచుకున్న వెంటనే, రాహుల్ ఆట అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అతను పూర్తిగా ఫిట్‌గా లేడు. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ భారత టెస్టు జట్టులో అవకాశం లభించింది.

మూడో టెస్టు కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us