IND vs ENG: సెంచరీతో మెరిసిన గిల్.. నిరాశపర్చిన మిగతా బ్యాటర్లు.. ఇంగ్లండ్ విన్నింగ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్ తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. శుభమన్ గిల్ (104) సెంచరీ మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు

ఇంగ్లండ్ తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. శుభమన్ గిల్ (104) సెంచరీ మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో భారత జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ తరఫున టామ్ హార్ట్లీ 4 వికెట్లు, రెహాన్ అహ్మద్ 3 వికెట్లు, అనుభవజ్ఞుడైన పేసర్ జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీయగలిగారుతొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్ జట్టుకు 399 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది రోహిత్ సేన. అసలే బజ్ బాల్ అంటూ భారీస్కోర్లను సైతం అలవోకగా ఛేదిస్తోన్న ఇంగ్లండ్ ను భారత బౌలర్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ చేసిన టీమ్ ఇండియా, ఆ తర్వాత రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. మూడో రోజు టీమ్ ఇండియా అన్ని వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ 227 పరుగులలో శుభ్‌మన్ గిల్ ఒక్కడే 104 పరుగులు చేశాడు. టీమ్ ఇండియాలో శుభ్‌మన్ మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
శుభ్‌మన్ తర్వాత అక్షర్ పటేల్ 45 పరుగులు చేయగా , శ్రేయాస్ అయ్యర్, ఆర్ అశ్విన్ చెరో 29 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన యస్సవ్ జైస్వాల్ 17 పరుగులకే పెవిలియన్ చేరాడు. సిరీస్ లో దారుణంగా విఫలమవుతోన్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 13 పరుగులకే ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా సున్నాకి ఔట్ కాగా, మిగిలిన ముగ్గురు రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.
Innings Break! #TeamIndia posted 2⃣5⃣5⃣ on the board!
Target for England – 399.
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Tmoa1iOWRN
— BCCI (@BCCI) February 4, 2024
రెండు జట్లు
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్.
ఇంగ్లండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.
గిల్ ఒక్కడే..
1⃣0⃣4⃣ Runs 1⃣4⃣7⃣ Balls 1⃣1⃣ Fours 2⃣ Sixes
That was one fine knock from Shubman Gill! 👏 👏
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/YlzDM8vwjb
— BCCI (@BCCI) February 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..








