India vs England: ఒకే మ్యాచ్‌లో ఒకే రికార్డ్‌పై కన్నేసిన రోహిత్, విరాట్.. అదేంటంటే?

ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి రోహిత్‌, మాజీ సారథి విరాట్‌లకు ఎంతో ప్రత్యేకం కానుంది. వీరిద్దరూ ఒకే మ్యాచ్‌లో ఓ స్పెషల్ రికార్డుపై కన్నేశారు. ఇంగ్లండ్‌తో జరిగే రెండో టీ20లో రోహిత్, కోహ్లీలు ఇద్దరూ మరో..

India vs England: ఒకే మ్యాచ్‌లో ఒకే రికార్డ్‌పై కన్నేసిన రోహిత్, విరాట్.. అదేంటంటే?
Rohit Sharma, Virat Kohli

Updated on: Jul 09, 2022 | 5:27 PM

India vs England: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలిచేందుకు టీమిండియా బరిలోకి దిగనుండగా, ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి, సిరీస్‌లో సమం కావాలని ఇంగ్లండ్ టీం కోరుకుంటోంది. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి రోహిత్‌, మాజీ సారథి విరాట్‌లకు ఎంతో ప్రత్యేకం కానుంది. వీరిద్దరూ ఒకే మ్యాచ్‌లో ఓ స్పెషల్ రికార్డుపై కన్నేశారు. ఇంగ్లండ్‌తో జరిగే రెండో టీ20లో రోహిత్, కోహ్లీలు ఇద్దరూ మరో 2 ఫోర్లు బాదితే టీ20 ఫార్మాట్‌లో అరుదైన రికార్డ్‌లో చేరనున్నారు. దీంతో వీరిద్దరూ 300 ఫోర్లు బాదిన ఆటగాళ్ల లిస్టులో చేరనున్నారు. కోహ్లీ, రోహిత్‌ల ఖాతాలో ప్రస్తుతం చెరో 298 ఫోర్లు ఉన్నాయి.

టీ20 ఫార్మాట్‌లో 300 ఫోర్లు బాదిన రికార్డ్ ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ పేరిట నిలిచింది. ఈ ఐర్లాండ్ ప్లేయర్ 104 టీ20ల్లో మొత్తం 325 ఫోర్లు బాదేశాడు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లు గెలిస్తే.. వరుసగా 14 టీ20 మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే, మ్యాచ్ గురించి మాట్లాడితే.. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆటగాళ్లను ప్లేయింగ్ XIలో ఎలా భర్తీ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురించి ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఈ సిరీస్‌లో విరాట్ రాణించలేకపోతే, అతను టీ20 జట్టు నుంచి తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ వారికి చాలా కీలకం కానుంది. అయితే తొలి మ్యాచ్‌లో ఆడిన బ్యాట్స్‌మెన్‌ని కాకుండా ప్లేయింగ్-11లోకి ఎలా తీసుకొస్తాడో చూడాలి.