India vs England, 2nd ODI: చాహల్‌ స్పిన్‌ మ్యాజిక్‌కు ఇంగ్లండ్‌ విలవిల.. లార్డ్స్‌ వన్డేలో టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..

|

Jul 14, 2022 | 10:17 PM

India vs England: టీమిండియా బౌలర్లు మళ్లీ మెరిశారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య జట్టును 246 పరుగులకు కట్టడి చేశారు. స్పిన్‌ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ 4/47తో..

India vs England, 2nd ODI: చాహల్‌ స్పిన్‌ మ్యాజిక్‌కు ఇంగ్లండ్‌ విలవిల.. లార్డ్స్‌ వన్డేలో టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..
India Vs England
Follow us on

India vs England: టీమిండియా బౌలర్లు మళ్లీ మెరిశారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య జట్టును 246 పరుగులకు కట్టడి చేశారు. స్పిన్‌ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ 4/47తో ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు. అతనికి తోడు బుమ్రా (49/2), హార్దిక్‌ పాండ్యా (28/2) కూడా రాణించడంతో బ్రిటిష్‌ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. మొయిన్‌ అలీ (47; 64 బంతుల్లో 2×4, 2×6), డేవిడ్‌ విల్లే (41; 49 బంతుల్లో 2×4, 2×6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గాయం కారణంగా మొదటి వన్డేకు దూరమైన కింగ్ కోహ్లీ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు.

చాహల్‌ మాయాజాలం..

ఇవి కూడా చదవండి

కాగా ఇంగ్లండ్‌ జట్టుకు ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (23; 33 బంతుల్లో 2×4, 1×6), జానీ బెయిర్‌ స్టో (38; 38 బంతుల్లో 6×4) శుభారంభం అందించారు. అయితే హార్దిక్‌ పాండ్య తన తొలి ఓవర్‌లోనే జేసన్‌ రాయ్‌ను ఔట్‌చేసి భారతజట్టుకు మొదటి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత చాహల్‌ మాయాజాలం మొదలైంది.. బెయిర్‌ స్టో, జో రూట్‌ (11), బెన్‌ స్టోక్స్‌ (21)లను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌కు గట్టి షాకిచ్చాడు. మరోవైపు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (4)ను షమి బోల్తా కొట్టించాడు. దీంతో ఇంగ్లాండ్‌ 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (33; 33 బంతుల్లో 2×4, 2×6), మొయిన్‌ అలీ కాసేపు ప్రతిఘటించారు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత మొయిన్‌ అలీ, విల్లే నిలకడగా ఆడి ఏడో వికెట్‌కు మరో విలువైన భాగస్వామ్యం జోడించారు. చివరికి అలీ సైతం చాహల్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అతయితే విల్లే టెయిలెండర్లతో కలిసి కాస్త ధాటిగా ఆడి ఇంగ్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..