Indian Cricket Team: టీమిండియాతో తలపడే ఇంగ్లీష్ జట్టు ప్రకటన.. జులై 20 నుంచి మ్యాచ్.. కోహ్లీ టీంలో ఇద్దరు మిస్!

ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు భారత ఆటగాళ్లు సన్నద్ధం కానున్నారు. అయితే, ఈలోపు టీమిండియాలో కరోనా కలకలం చెలరేగింది.

Indian Cricket Team: టీమిండియాతో తలపడే ఇంగ్లీష్ జట్టు ప్రకటన.. జులై 20 నుంచి మ్యాచ్.. కోహ్లీ టీంలో ఇద్దరు మిస్!
Indian Cricket Team

Edited By:

Updated on: Jul 16, 2021 | 3:10 PM

IND vs ENG 2021: ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు భారత ఆటగాళ్లు సన్నద్ధం కానున్నారు. అయితే, ఈలోపు టీమిండియాలో కరోనా కలకలం చెలరేగింది. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో ఫస్ట్ క్లాస్ ప్రాక్టీస్ మ్యాచ్ కావాలని విరాట్ కోహ్లీ కోరిక మేరకు బీసీసీఐ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును కోరింది. దీంతో ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈసీబీ ఏర్పాటు చేసింది. జులై 20 నుంచి డర్హామ్‌లోని కౌంటీ ఎలెవన్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈమూడు రోజుల మ్యాచ్‌లో సత్తా చాటేందుకు టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. కాగా, ఈమ్యాచ్ కోసం కౌంటీ XI జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో ఇంగ్లండ్‌ కౌంటీల్లోని వివిధ టీంలనుంచి ప్లేయర్లను ఎంచుకున్నారు. ఈ జట్టుకు విల్ రోడ్స్ కౌంటీ XI జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో మొత్తం 15మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. ఈ కారణంగా ఏ కౌంటీ జట్టు టీమిండియాతో ఆడేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. పలు కౌంటీ జట్లలోని ప్లేయర్లను ఎంపిక చేసి కౌంటీ XI టీంను ఎంపిక చేశారు.

అంతా సవ్యంగా జరుగుతోందని భారత ఆటగాళ్లు అనుకుంటున్న వేళ.. టీమిండియాలో కరోనా కలకలం చెలరేగింది. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, త్రోడౌన్ స్పెషలిస్టు దయానంద్ జరానీ కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో బౌలింగ్ కోచ్ భారత్ అరుణ్, రిజర్వ్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, స్టాండ్‌బై ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను రంగంలోకి దింపారు.

కేఎల్ రాహుల్..
కరోనా పాజిటివ్‌తో పంత్, జరానీలు లండన్‌లోనే ఉంటారు. మిగిలిన జట్టంతా డర్హామ్‌ చేరుకోనుంది. పంత్, జరానీలు జులై 20 నుంచి మొదలయ్యే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడేందుకు వీలులేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు నెరవేర్చనున్నాడు. కాగా, ఇప్పటికే టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

కౌంటీ XI జట్టు:
విల్ రోడ్స్ (కెప్టెన్), రెహన్ అహ్మద్, టామ్ అస్పిన్‌వెల్, ఏతాన్ బాంబర్, జేమ్స్ బ్రేసీ, జాక్ కార్సన్, జాక్ చాపెల్, హసీబ్ హమీద్, లిండన్ జేమ్స్, జేక్ లిబ్బి, క్రెయిగ్ మైల్స్, లియామ్ పీటర్సన్ వైట్, జేమ్స్ రూ, రాబ్ యేట్స్.

Also Read:

రెండేళ్లుగా సెంచరీ జోలికి పోని టీమిండియా కెప్టెన్..! మరీ సెంచరీ చేయకుండా 189 వన్డేలు ఆడిన లెజెండ్ క్రికెటర్ గురించి తెలుసా?

IND vs SL: ఫేస్‌బుక్‌లో భారత్, శ్రీలంక సిరీస్.. ఎలా చూడాలో తెలుసా?

Westindies vs Australia: భారీ షాట్లు ఆడబోయి బోల్తాపడ్డావ్‌గా.. అంత అత్యుత్సాహం ఎందుకయ్యా..! విండీస్ దిగ్గజంపై నెటిజన్ల ఆగ్రహం