Virat Kohli: కాన్పూర్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్‌ను సైతం అధిగమించి ఏకైక క్రికెటర్‌గా..

|

Oct 01, 2024 | 3:08 PM

. కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ఈ 47 పరుగులతో కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు

Virat Kohli: కాన్పూర్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్‌ను సైతం అధిగమించి ఏకైక క్రికెటర్‌గా..
Virat Kohli
Follow us on

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ ద్వారా టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. అంతేకాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును కూడా బద్దలు కొట్టడం విశేషం. కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ఈ 47 పరుగులతో కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ కేవలం 594 ఇన్నింగ్స్‌లలో 27000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ప్రపంచంలోనే 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 4వ బ్యాటర్‌ కూడా కోహ్లీనే.
సచిన్, విరాట్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 27000+ పరుగులు సాధించారు. లంక జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 648 ఇన్నింగ్స్‌ల ద్వారా 27 వేల పరుగులు పూర్తి చేశాడు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించడానికి పాంటింగ్ 650 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

అయితే కేవలం 594 ఇన్నింగ్స్‌ల్లోనే 27 వేల పరుగులు పూర్తి చేసి 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. కాగా రెండో ఇన్నింగ్స్ లోనూ కోహ్లీ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. 95 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 37 బంతుల్లోనే 29 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

 

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):

షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (WK), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (wk), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..