భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ నోటిలో నల్ల దారం నములుతూ బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని గురించి సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. షకీబ్ అల్ హసన్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటాడు. అతని దూకుడు స్వభావం అందరికీ తెలిసిందే. ఇక భారత్ తో జరిగిన మొదటి టెస్టులో షకీబ్ అల్ హసన్ 32 పరుగులు చేశాడు. 64 బంతుల్లో మొత్తం 5 ఫోర్ల సాయంతో ఈ పరుగులు చేశాడు. అయితే రవీంద్ర జడేజా బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి ధ్రువ్ జురెల్ కు చిక్కాడీ స్టార్ ఆల్ రౌండర్. అయితే షకీబ్ ఇన్నింగ్స్ కంటే అతను బ్లాక్ థ్రెడ్‌ని కొరుకుతూ బ్యాటింగ్ చేయడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. ఇప్పటివరకు ఇలా ఎవరూ బ్యాటింగ్ చేయలేదు. షకీబ్ చేసిన పనికి కామెంటేటర్ దినేష్ కార్తీక్ కూడా ఆశ్చర్యపోయాడు. అయితే షకీబ్ అల్ హసన్ నోటిలో నల్ల దారం ఉంచుకుని బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని తమీమ్ ఇక్బాల్ వివరించాడు. అదేంటంటే.. ఈ థ్రెడ్ షకీబ్ ఏకాగత్రతో బ్యాటింగ్ చేయడానికి సహాయ పడుతోందట. ముఖం అటు ఇటూ తిప్పకుండా బంతిపైనే దృష్టి సారించేందుకు షకీబ్ ఇలా నల్లదారం నములుతూ బ్యాటింగ్ చేశాడని తమీమ్ చెప్పుకొచ్చాడు.
షకీబ్ అల్ హసన్ ఈ మధ్యన కంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఇందుకు సంబంధించి లండన్‌లోని ఓ నేత్ర వైద్యనిపుణులను కూడా సంప్రదించారు. కొన్ని రోజుల క్రితం గ్లోబల్ టీ20 టోర్నీ సందర్భంగా షకీబ్ ఇలాగే తన జెర్సీని కొరుకుతూ కనిపించాడు. కాగా ఈ మ్యాచ్ లో షకీబ్ అల్ హసన్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి ఇన్నింగ్స్ లో 8 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ షకీబ్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే బ్యాటింగ్ లో మాత్రం పర్వాలేదని పించాడు. ఇక ఓవర్ నైట్ స్కోరు 81/3 తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం భారత్ స్కోరు 194/3. శుభ్‌మన్ గిల్ 85 పరుగులతో ఆడుతుండగా, రిషబ్ పంత్ 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Shakib Al Hasan is leaving no stone unturned in his efforts to address his eye issues. ✅
Today he was (still) spotted biting down on a black strap while batting.#INDvsBAN #ShakibAlHasan pic.twitter.com/jLf1zS2ljI
— Washikur Rahman Simanto (@WashikurRahma75) September 20, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..