ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు 1 వికెట్ తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడిందని చెప్పుకోవడానికి బదులు భారత జట్టే తమ పేలవమైన ఫీల్డింగ్‌తో ఆతిథ్య జట్టుని గెలిపించిందని చెప్పుకోవచ్చు.ఓ వైపు విరాట్ కోహ్లి అద్భుత క్యాచ్‌తో బంగ్లా ఆల్‌రౌండర్‌ను పెవిలియన్‌కు పంపించినా.. మరోవైపు మిగతా ఆటగాళ్లు మాత్రం ఫీల్డింగ్‌లో పూర్తిగా నిరాశపరిచారు. క్యాచ్‌లు జారవిడడంతో పాటు ఓవర్‌త్రోలతో చేజేతులా మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. రోహిత్ శర్మ (27), శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లి (9) తొందరగానే నిష్క్రమిస్తే, శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే 5వ నంబర్‌లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లను తట్టుకుని 4 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు సహాయంతో 70 బంతుల్లో 73 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్ చేసిన ఈ హాఫ్ సెంచరీతో టీమ్ ఇండియా స్కోరు 150 దాటింది. తద్వారా భారత జట్టును పరువు కాపాడి హీరోగా మారిపోయాడు.దీంతో టీమిండియా 186 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 39 ఓవర్లలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే ఎప్పటిలాగే డెత్ బౌలింగ్ గండం మరోసారి టీమిండియాను వెక్కిరించింది. చివరి వికెట్ తీసేందుకు భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. దీనికి తోడు ఫీల్డింగ్ వైఫల్యం ఆతిథ్య జట్టుకు బాగా కలిసొచ్చింది. భారత్ విజయానికి ఒక వికెట్ అవసరమైన సమయంలో మెహదీ హసన్ మిరాజ్ అద్భుతమైన షాట్‌తో ముందుకు వచ్చాడు. బంతి వికెట్ల వెనక గాల్లోకి లేచింది. అయితే బంతిని అందుకునే యత్నంలో KL రాహుల్ విఫలమయ్యాడు. బంతిని అందుకున్నట్లే అందుకుని వదిలేశాడు. అప్పుడు మెహదీ హసన్ 15 పరుగులతో ఉన్నాడు. అలాగే బంగ్లాదేశ్ జట్టు స్కోరు 155/9. కేఎల్ రాహుల్ ఆ క్యాచ్ పట్టి ఉంటే టీమ్ ఇండియా 31 పరుగుల తేడాతో గెలిచి ఉండేది.
Kl Rahul droped the catch #klrahul pic.twitter.com/BnBwjvik9c
— Adnan Ansari (@AdnanAn71861809) December 4, 2022
దీని తర్వాత తనకు లభించిన జీవనదానాన్ని ఉపయోగించుకున్న మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ (10)తో కలిసి చివరి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలాగే 38 పరుగులు చేసి మెహదీ 1వికెట్ తేడాతో బంగ్లాదేశ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఒకవైపు తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులతో ఆకట్టుకుని టీమిండియాకు వీరవిహారం చేసిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో క్యాచ్‌ను వదిలేసి విలన్‌గా మారాడు.
This so called cool captain once again abu$ed his own teammate
This time sundar
No words ?
Shameless captain @ImRo45 pic.twitter.com/juqc5ozRjS— A (@MCG82_) December 4, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..