టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ బుధవారం ( డిసెంబర్ 14) నుండి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోసం ఇరు జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు.. టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా కనీసం టెస్టు సిరీస్ నైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. వన్డే సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు చాలా మంది గాయపడటంతో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రోహిత్ శర్మ గాయపడడంతో కేఎల్ రాహుల్‌కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కాగా ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల టైటింగ్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా రెండు టెస్టు మ్యాచ్‌లు పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మ్యాచ్‌ల సమయాన్ని మార్చేసి తొమ్మిది గంటలకు మార్చేశారు. ఇక తొలి టెస్టు మ్యాచ్‌కు టీమిండియాను ప్రకటించింది. ఇందులో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు జట్టులో అవకాశం దక్కింది.
రెండో వన్డేలో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరమయ్యాడు. అలాగే చికిత్స కోసం ముంబైకి తిరిగి వచ్చిన రోహిత్ వైద్యుల సూచనల మేరకు మొదటి టెస్టుకు దూరంగా ఉండనున్నాడు. ఇక రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది డాక్టర్ రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. అందుకే తొలి టెస్టుకు రోహిత్‌కు బదులుగా అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.రోహిత్ మాత్రమే కాదు, మరో ఇద్దరు అనుభవజ్ఞులైన భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు. గాయం కారణంగా గతంలో జట్టుకు దూరమైన మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా ఇంకా గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి వారిద్దరూ ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఆడలేరు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయాల నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వీరిద్దరూ టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. వీరిద్దరికి బదులుగా నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు. అలాగే జయదేవ్ ఉనద్కత్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు ఛెతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. ఇప్పటివరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించింది. గత కొంతకాలంగా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న రిషభ్‌కు ఇది హెచ్చరికేనని చెప్పవచ్చు.
Covering all bases, #TeamIndia trained in Chattogram ahead of our 1st Test against Bangladesh.
Snapshots from our training session ??#BANvIND pic.twitter.com/xh6l9rdhYu
— BCCI (@BCCI) December 12, 2022
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరభ్‌కుమార్, జయదేవ్ ఉనద్కత్.
Covering all bases, #TeamIndia trained in Chattogram ahead of our 1st Test against Bangladesh.
Snapshots from our training session ??#BANvIND pic.twitter.com/xh6l9rdhYu
— BCCI (@BCCI) December 12, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..