IND vs BAN: బంగ్లాతో తలపడే భారత జట్టు ఇదే.. స్వ్కాడ్‌లోకి ఎవరూ ఊహించని ప్లేయర్ ఎంట్రీ

|

Sep 09, 2024 | 3:37 PM

IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును నిన్న అంటే ఆదివారం నాడు ప్రకటించారు. ఎప్పటిలాగే, టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా.. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మొదటి టెస్ట్ జట్టులో ఉన్నారు. అలాగే, కేఎల్ రాహుల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.

IND vs BAN: బంగ్లాతో తలపడే భారత జట్టు ఇదే.. స్వ్కాడ్‌లోకి ఎవరూ ఊహించని ప్లేయర్ ఎంట్రీ
Ind Vs Ban 1st Test
Follow us on

IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును నిన్న అంటే ఆదివారం నాడు ప్రకటించారు. ఎప్పటిలాగే, టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా.. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మొదటి టెస్ట్ జట్టులో ఉన్నారు. అలాగే, కేఎల్ రాహుల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ మొదటిసారిగా భారత టెస్ట్ జట్టులో అవకాశం పొందాడు. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

చాలా మంది రీఎంట్రీ..

వాస్తవానికి గత మార్చిలో ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడింది. ఆ తర్వాత భారత్ వైట్ జెర్సీలో ఆడటం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌తో చాలా మంది స్టార్ క్రికెటర్లు తిరిగి టెస్టు జట్టులోకి వస్తున్నారు. అందులో ప్రధానమైనది విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడలేదు. తన రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్న విరాట్ తన కుటుంబంతో గడపడానికి సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ సరిగ్గా 21 నెలల తర్వాత టెస్టు జట్టులో కనిపించనున్నాడు. 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదం కారణంగా భారత జట్టుకు దూరమైన పంత్ గత ఐపీఎల్ నుంచి మళ్లీ క్రికెట్ రంగంలోకి వచ్చాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ ఆడిన పంత్ ఇప్పుడు టెస్టు జట్టులో కనిపించనున్నాడు. ఆశ్చర్యకరంగా, పంత్ 21 నెలల క్రితం బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడడం గమనార్హం.

బుమ్రాకు ఛాన్స్..

నిజానికి టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు దూరమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి. న్యూజిలాండ్‌తో 3 టెస్టులు, తదుపరి ఆస్ట్రేలియా పర్యటన దృష్ట్యా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే, ఈ టెస్టు సిరీస్‌ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ బుమ్రాను జట్టులోకి ఎంపిక చేసింది. అయితే, బుమ్రా పనిభారాన్ని నిర్వహిస్తామని సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టు నుంచి బుమ్రాకు విశ్రాంతినిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండున్నర నెలల తర్వాత బుమ్రా తొలిసారి క్రికెట్ ఆడనున్నాడు.

తొలి టెస్టు మ్యాచ్‌కి టీమిండియా..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్, రవీంద్, జావిద్, జావిద్ క్షర్ పటేల్, ఆర్. అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, యశ్ దయాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..