ఏడేళ్ల తర్వాత బంగ్లా దేశ్‌లో అడుగుపెట్టిన టీమిండియాకు పసికూన భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం (డిసెంబర్ 4) జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు వికెట్ తేడాతో భారత జట్టుపై సంచలన విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో మెహిది హసన్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ (10 నాటౌట్) అభేద్యమైన చివరి వికెట్‌కు 51 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌కు మరుపురాని విజయాన్ని అందించారు. 187 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే టీమిండియా ఫీల్డర్ల చెత్త ప్రదర్శన బంగ్లాకు కలిసొచ్చింది. క్యాచ్‌లు, ఓవర్‌త్రోలతో ఆతిథ్య జట్టును దగ్గరుండీ మరి గెలిపించారు. దీంతో 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది బంగ్లా. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం (డిసెంబర్ 7) జరగనుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (27), శిఖర్ ధావన్ (7) తొందరగానే నిష్క్రమించారు. ఆ తర్వాత లిటన్ దాస్ వేసిన అద్భుత క్యాచ్ కారణంగా విరాట్ కోహ్లి (9) నిష్క్రమించాల్సి వచ్చింది. శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మిడిలార్డర్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ఆర్ 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసింది. ఈ దశలో ఇబాదత్ హొస్సేన్ క్యాచ్ పట్టిన రాహుల్ నిష్క్రమించాడు.ఈ సమయంలో చెలరేగిన షకీబ్ అల్ హసన్.. టీమిండియా లోయర్ ఆర్డర్ పనిపట్టాడు. ఫలితంగా టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తరఫున షకీబ్ 10 ఓవర్లలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, ఇబాదత్ 4 వికెట్లతో మెరిశాడు.
ఇక 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు కూడా శుభారంభం లభించలేదు. దీపక్ చాహర్ తొలి ఓవర్ తొలి బంతికే నజ్ముల్ (0) వికెట్ తీసి టీమిండియాకు తొలి శుభారంభం అందించాడు. దీని తర్వాత అనముల్ హక్ (14)ని కూడా సిరాజ్ ఔట్ చేశాడు. ఈ దశలో జతకట్టిన లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీ 3వ వికెట్‌కు 48 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. ఈ సమయంలో 41 పరుగులు చేసిన లిటన్ దాస్ వాషింగ్టన్ సుందర్ క్యాచ్‌కు ఔటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్‌కు షకీబ్ (29) కూడా పెవిలియన్ దారి పట్టాడు. మరోవైపు ఆద్యంతం అద్భుతంగా బంతులేసిన మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌కు మంచి సహకారం అందించిన కుల్దీప్ సేన్ కూడా 2 వికెట్లు తీశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున పడింది. అయితే ఆఖరి వికెట్ పడగొట్టడానికి టీమిండియా బౌలర్లు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా జట్టు స్కోరు 150 పరుగుల వద్ద ఉండగా.. మిరాజ్ ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీనిని వినియోగించుకున్న మెహదీ హసన్ మిరాజ్ 38 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అంతే కాకుండా మిరాజ్, ముస్తాఫిజుర్ రెహమాన్ (10) చివరి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఛేదించింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 1 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్
బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్:
లిటన్ దాస్ (కెప్టెన్), అనాముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, ఇబాదత్ హొస్సేన్.
Things went right down to the wire but it was Bangladesh who won the first ODI.#TeamIndia will look to bounce back in the second ODI of the series ? #BANvIND
Scorecard ? https://t.co/XA4dUcD6iy pic.twitter.com/Ko3Snyqdpp
— BCCI (@BCCI) December 4, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..