WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. తొలి ఎడిషన్‌లోనూ భారత జట్టు ఫైనల్‌కు చేరినా న్యూజిలాండ్‌పై విజయం సాధించలేకపోయింది. ఈసారి ఆ లోటును పూడ్చాలని, 2013 నుంచి ఐసీసీ ట్రోఫీని గెల్చుకోవాలనే కోరికను నేరవేర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే మ్యాచ్ లండన్ వేదికగా జరుగుతున్నందున వర్షం అంతరాయంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి కూడా వర్షం ఏ విధంగా అడ్డుపడిందో మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారడం క్రికెట్ అభిమానులకు ఇష్టం కలిగించని విషయం అని చెప్పుకోవాలి.
Preparations, adapting to the conditions and getting into the #WTC23 Final groove ?
ఇవి కూడా చదవండిHear from Paras Mhambrey, T Dilip & Vikram Rathour on #TeamIndia‘s preps ahead of the all-important clash ???? – By @RajalArora
Full Video ??https://t.co/AyJN4GzSRD pic.twitter.com/x5wRxTn99b
— BCCI (@BCCI) May 31, 2023
ఇంగ్లాండ్‌లోని లండన్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది. వరల్డ్ వెదర్‌లైన్ ప్రకారం జూన్ 7-11 మధ్య నిరంతర వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదటి 3 రోజులలో అంటే జూన్ 7 నుంచి 9 వరకు తేలికపాటి వర్షాలు, అలాగే జూన్ 10 నుంచి 11 వరకు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అయితే డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్‌కి జూన్ 12 రిజర్వ్ డేగా ఉంది. ఈ పరిస్థితిలో మ్యాచ్ కొంత వరకు జరిగినా రిజర్వ్ డే రోజు అయినా ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది.
Virat Kohli’s work ethic allows him to remain one of the most prized scalps in Test cricket.
Read more ? https://t.co/EuPGgZiYuz pic.twitter.com/kmNhYErOY6
— ICC (@ICC) June 1, 2023
కానీ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ ఫలితం రాకపోతే భారత్-ఆస్ట్రేలియా జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. అంటే భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండూ కూడా టెస్ట్ చాంపియన్‌షిప్ విజేతలుగా నిలుస్తాయి. రెండు జట్లూ జాయింట్ విన్నర్స్‌గా మారితే, ఇక్కడ ప్రైజ్ మనీ ఏమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ముందుగా ప్రకటించినట్లుగా అయితే టోర్నీ విజేతకు రూ. 13.22 కోట్ల రూపాయలను, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 6.61 కోట్లు ప్రైజ్ మనీగా అందుతుంది. మరి ఈ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రాగా ముగిసి ఇరు జట్లు విజేతలుగా నిలిస్తే.. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి చెరో సగం అంటే రూ. 6.61 కోట్లు అందుతుంది.
? A red-hot opener
☝️ The leader of the pace attack
? A pair of batting stalwartsRicky Ponting looks at the keys to India’s hopes of #WTC23 Final success.https://t.co/hYN06S6Vz3
— ICC (@ICC) June 1, 2023
రిజర్వ్ డేని ఎప్పుడు ఉపయోగిస్తారు ..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐసీసీ డబ్య్లూటీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఆప్షన్ ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంలో పూర్తికానప్పుడు రిజర్వ్ డే ఉపయోగపడుతుంది. నిర్ణీత ఐదు రోజుల్లో ఆట నిర్ణీత సమయం కంటే తక్కువగా జరిగి ఫలితం రాకపోయినా కూడా రిజర్వ్ డేని ఉపయోగించవచ్చు. మ్యాచ్ ఫలితం నిర్ణీత ఐదు రోజుల్లో వస్తే, అప్పుడు రిజర్వ్ డే అవసరం ఉండదు. మ్యాచ్ జరిగే ప్రతి రోజు నిర్ణీత ఓవర్ల కంటే తక్కువ ఆడితే మాత్రమే రిజర్వ్ డేలో మ్యాచ్ ఆడతారు. అసలు రిజర్వ్ డేని ఉపయోగించాలా వద్దా అనేది మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తారు.
A change of format means a change of gears ?
Axar Patel on how India are preparing for the #WTC23 Final.https://t.co/goYZmKTrA0
— ICC (@ICC) June 1, 2023
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
భారత టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్
టీమిండియా స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..