Australia Test Stats In India: ఆస్ట్రేలియా జట్టు భారత్‌తో 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతోంది. ప్రస్తుతం కంగారూ జట్టు సిరీస్‌లో 2-0తో వెనుకంజలో ఉంది. ఈ సిరీస్‌లోని మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరగనుంది. కాగా, సిరీస్‌లోని చివరి టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనుంది. ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. అయితే నలుగురు దిగ్గజ ఆస్ట్రేలియన్ కెప్టెన్లు భారత గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్ గెలవలేదని మీకు తెలుసా? ఈ జాబితాలో చాలా మంది పెద్ద పేర్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ అలాన్ బోర్డర్ క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్లలో ఒకటిగా పేరుగాంచాడు. అయితే ఈ ఆటగాడి కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై ఎప్పుడూ ఒక టెస్ట్ మ్యాచ్ గెలవలేదని మీకు తెలుసా. అలన్ బోర్డర్ కెప్టెన్సీలో, కంగారూ జట్టు 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. 32 గెలిచింది. కానీ భారత గడ్డపై మాత్రం జట్టును గెలవలేకపోయాడు.
రికీ పాంటింగ్ కెప్టెన్సీలో, కంగారూ జట్టు వరుసగా రెండు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. రికీ పాంటింగ్ కెప్టెన్‌గా టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో చాలా విజయవంతమయ్యాడు. అయితే అతను భారత గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్‌లో కూడా జట్టును గెలిపించలేకపోయాడు. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో కంగారూ జట్టు భారత గడ్డపై 7 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో 5 ఓడిపోగా, 2 టెస్టు మ్యాచ్‌లు డ్రా అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
రికీ పాంటింగ్ తర్వాత మైఖేల్ క్లార్క్ ఆస్ట్రేలియా జట్టుకు బాధ్యతలు చేపట్టాటు. మైకేల్ క్లార్క్ కంగారూ జట్టుకు 47 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. నిజానికి, కెప్టెన్‌గా మైఖేల్ క్లార్క్ రికార్డు అద్భుతమైనది. కానీ, అతను భారత గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌ని కూడా గెలవలేకపోయాడు. మైఖేల్ క్లార్క్ 47 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించి, 24 మ్యాచ్‌లు గెలిచినా, భారత గడ్డపై రిక్తహస్తాలతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, అతను ఈ సిరీస్‌లోని మూడవ టెస్ట్‌లో ఆడడంలేదు. నాగ్‌పూర్ టెస్ట్‌తో పాటు, ఢిల్లీ టెస్ట్‌లో పాట్ కమిన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కంగారూ జట్టు రెండు టెస్టుల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పాట్ కమ్మిన్స్ పేరు ఆస్ట్రేలియా కెప్టెన్ల జాబితాలో చేరింది. అతని కెప్టెన్సీలో కంగారూ జట్టు భారతదేశంలో ఎప్పుడూ టెస్ట్ మ్యాచ్‌లను గెలవలేదు.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..