IND vs AUS: అరంగేట్రంలో అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మెరుపు స్టంపింగ్‌తో ధోనిని గుర్తు చేసిన భరత్‌.. వీడియో వైరల్

ఈ టెస్టు ద్వారా తెలుగు కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌ టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌ ఆద్యంతం ఎంతో హుషారుగా, ఉత్సాహంగా కనిపించిన భరత్‌ మెరుపువేగంతో స్టంపౌట్‌ చేసి ఎంఎస్‌ ధోనిని గుర్తుచేశాడు.

IND vs AUS: అరంగేట్రంలో అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మెరుపు స్టంపింగ్‌తో ధోనిని గుర్తు చేసిన భరత్‌.. వీడియో వైరల్
Ks Bharat
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2023 | 9:17 AM

బోర్డర్- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం (ఫిబ్రవరి 09) మొదటి టెస్ట్‌ ప్రారంభమైంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్‌లో మొదటి రోజు టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్‌ ఓడి మొదట ఫీల్డింగ్‌ చేసిన భారత్‌ ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్‌ చేసింది. వెటరన్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 3 వికెట్లతో రాణించాడు. కాగా ఈ టెస్టు ద్వారా తెలుగు కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌ టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌ ఆద్యంతం ఎంతో హుషారుగా, ఉత్సాహంగా కనిపించిన భరత్‌ మెరుపువేగంతో స్టంపౌట్‌ చేసి ఎంఎస్‌ ధోనిని గుర్తుచేశాడు. క్రీజులో పాతుకుపోయిన ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ (49) భరత్‌ ధాటికి బలయ్యాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో ఐదో బంతికి లబుషేన్‌ ముందుకు వచ్చి కవర్‌డ్రైవ్‌ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి టర్న్‌ అయ్యి నేరుగా వికెట్‌ కీపర్‌ భరత్‌ చేతుల్లోకి వెళ్లింది. బంతిని అందుకున్న భరత్‌ రెప్పపాటులో బెయిల్స్‌ను పడగొట్టేశాడు.

ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ థర్డ్‌ అంపైర్‌కు నివేదించాడు. స్టంపింగ్‌ సమయంలో లబుషేన్‌ క్రీజుకు దూరంగా ఉన్నట్లు స్పష్టంగా తెలియడంతో ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. కాగా భరత్‌ స్టంపింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగుతేజం టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనిని గుర్తుచేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో స్టంపింగ్‌తో పాటు డీఆర్ఎస్‌ నిర్ణయాలు తీసుకోవడంలోను చురుగ్గా వ్యవహరించాడు భరత్. ఇక బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (56), రవిచంద్రన్‌ అశ్విన్‌ (0) క్రీజులో ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌ (20) నిరాశపరిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..