IND vs AUS: హైదరాబాద్‌లో టీ20 ఫీవర్.. 3 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్.. పోలీసుల కీలక సూచనలు..

|

Sep 25, 2022 | 10:00 AM

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. భారత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమైనప్పటికీ..

IND vs AUS: హైదరాబాద్‌లో టీ20 ఫీవర్.. 3 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్.. పోలీసుల కీలక సూచనలు..
Ind Vs Aus 3rd T20i Hyderabad
Follow us on

India vs Australia 3rd T20I: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. భారత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమైనప్పటికీ, ఆస్ట్రేలియా ప్రతి సిరీస్‌లోనూ గట్టి పోటీనిస్తుంది. 2013 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను టీమిండియా గెలవలేదు. చివరిసారిగా 9 సంవత్సరాల క్రితం 2013లో 1-0లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. ఆ తర్వాత 2017లో జరిగిన టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది. అదే సమయంలో చివరి T20 సిరీస్ 2019 లో జరిగింది. దీనిని ఆస్ట్రేలియా జట్టు 2-0 తేడాతో గెలుచుకుంది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకంగా మారింది. ఇక ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్‌ జట్టు నిలిచింది. అయితే, నాగ్‌పూర్‌లో జరిగిన టీ20లో విజయం సాధించిన రోహిత్ సేన.. ఆ రికార్డును సమం చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే 21 విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. గతేడాది పాకిస్తాన్ జట్టు 20 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడంతో.. అభిమానులకు టీ20 ఫీవర్ పట్టుకుంది. ఈ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రేక్షకులకు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  1. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30గంలకు ఈ మ్యాచ్ జరగనంది.
  2. మూడేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. దీంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫ్యాన్స్ పోటీపడుతున్నారు.
  5. ఉప్పల్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
  6. 2019 డిసెంబరులో జరిగిన‌ ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఇరుజట్లు 200పైగా పరుగులు నమోదు చేశాయి.
  7. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.
  8. మ్యాచ్ కోసం 300 నిఘా కెమెరాలకు పోలీసులు ఏర్పాటు చేశారు.
  9. గ్రౌండ్‌లో కూర్చున్న ప్రతీ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసుకునేలా ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు.
  10. ప్రేక్షకులు మొబైల్ ఫోన్స్‌తోపాటు హెడ్ ఫోన్స్ అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.
  11. కెమెరాలు, బైనక్యులర్, ల్యాప్ టాప్, సిగరెట్ లైట్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్, వెపన్స్, ఆల్కహాల్ బెవరేజేస్ లాంటి వస్తువులు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు.
  12. పెట్స్ అనిమల్స్, హెల్మెట్లు, క్రాకర్స్, తినే వస్తువులు కూడా బయట నుంచి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
  13. సెల్ఫీ స్టిక్స్, మాదక ద్రవ్యాలు కూడా అనుమతి ఉండదని తెలిపారు.
  14. 4 నుంచి నలుగున్నర మధ్యలో గేట్లు ఓపెన్ చేసి లోపలికి అనుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.
  15. ఆక్టోపస్ యూనిట్స్ రెండు, షార్ప్ షూటర్స్ అందుబాటులో ఉంటారు.
  16. పిక్ ప్యాకెటర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రతగా ఉండాలని పోలీసులు తెలిపారు.
  17. ఏడు అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో రెండు ప్లేయర్స్ కోసం కాగా, మిగతా ఐదు ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
  18. స్నేక్ క్యాచర్స్ లను కూడా అందుబాటులో ఉంచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..