AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 3rd T20 : బెల్లెరివ్ ఓవల్ భయానక రికార్డు.. సిరీస్ ఆశలు నిలవాలంటే టీమిండియా అలా చేయాల్సిందే

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం నాడు హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

IND vs AUS 3rd T20 :  బెల్లెరివ్ ఓవల్ భయానక రికార్డు.. సిరీస్ ఆశలు నిలవాలంటే టీమిండియా అలా చేయాల్సిందే
భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు (అక్టోబర్ 31) 2వ T20I జరగనుంది. మెల్‌బోర్న్‌లోని MCG స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తన ప్లేయింగ్ స్క్వాడ్‌లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు.
Rakesh
|

Updated on: Nov 01, 2025 | 1:41 PM

Share

IND vs AUS 3rd T20 : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం నాడు హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే ఈ మైదానం రికార్డులు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సేనను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే ఈ స్టేడియంలో టీ20 చరిత్రలో ఆస్ట్రేలియాకు అపజయం అంటూ లేదు. ఈ భయానక రికార్డును బద్దలు కొట్టి, భారత్ ఎలా విజయం సాధిస్తుందో చూడాలి.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం నాడు బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ గెలవడం భారత జట్టుకు అత్యంత కీలకం. సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, సిరీస్ గెలిచే అవకాశాలు పూర్తిగా దూరమవుతాయి. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ ఆడిన ఐదు టీ20 సిరీస్‌లలోనూ విజయం సాధించింది. ఆ విజయాల పరంపరను కొనసాగించాలంటే హోబర్ట్‌లో విజయం సాధించడం తప్పనిసరి.

బెల్లెరివ్ ఓవల్ స్టేడియం చరిత్ర టీమిండియాకు ఆందోళన కలిగించే అంశం. ఈ మైదానంలో ఆస్ట్రేలియా టీ20లలో అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. ఆస్ట్రేలియా ఈ మైదానంలో ఇప్పటివరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడగా, వాటన్నింటిలోనూ విజయం సాధించింది. ఇక్కడ ఆ జట్టుకు ఇప్పటివరకు ఓటమే లేదు. భారత క్రికెట్ జట్టు మొదటిసారిగా ఈ మైదానంలో టీ20 మ్యాచ్ ఆడబోతోంది. 2024 నవంబర్ 18న ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.

రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ప్రదర్శన నిరాశపరిచింది. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమవగా శుభ్‌మన్ గిల్ కేవలం 5 పరుగులే చేశాడు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మాత్రం అద్భుతంగా ఆడి, 37 బంతుల్లో 68 పరుగులు చేసి, భారత ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చాడు. మూడో మ్యాచ్‌లో గెలవాలంటే టాప్ ఆర్డర్ రాణించడం తప్పనిసరి. ఆస్ట్రేలియాకు కాస్త షాక్ కలిగించే విషయం ఏమిటంటే రెండో మ్యాచ్‌లో హీరో అయిన జోష్ హేజిల్‌వుడ్ ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకే జట్టులో ఉన్నాడు కాబట్టి మూడో టీ20లో ఆడడు.

ఇరు జట్ల స్క్వాడ్‌లు టీమిండియా స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా స్క్వాడ్: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, మహాలి బియర్‌డ్‌మ్యాన్, టిమ్ డేవిడ్, నేథన్ ఎల్లీస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ కుహ్‌నేమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..